న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అశ్విన్ బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శన అతన్ని టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేసేలా ఉంది అన్న గవాస్కర్

Gavaskar said Ashwin batting and bowling prowess has earned him a place in the T20 World Cup squad

గత రెండు నెలలుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. క్రికెట్ అభిమానులకు సిసలైన పసందు అందిస్తోంది. ఈ క్రమంలో ఈ లీగ్‌లో రాణించిన అన్ క్యాప్డ్ ప్లేయర్లు టీ20 ప్రపంచ కప్‌ కోసం టీమిండియా తలుపు తట్టే ప్రదర్శన చేశారు. ప్రముఖ క్రికెటర్లు, విశ్లేషకులు కొంత మంది అన్‌క్యాప్‌డ్ స్టార్‌లతో పాటు కొంతమంది ఇప్పటికే టీమిండియా తరఫున ఆడి జట్టులో చోటు కోల్పోయిన ప్లేయర్ల ప్రదర్శనను కూడా గమనించారు.

వారిలో కొందరు సీనియర్ ప్లేయర్లు ఆకట్టుకోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇక ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించిన తర్వాత భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. టీ20 ప్రపంచకప్‌ జట్టుకు 35ఏళ్ల భారత స్టార్‌ తప్పకుండా ఎంపికవుతాడని జోస్యం చెప్పాడు. అతను ప్రస్తావించిన ప్లేయర్ ఎవరో కాదు రవిచంద్రన్ అశ్విన్.

స్ట్రైక్ రేటు కూడా సూపర్

స్ట్రైక్ రేటు కూడా సూపర్

ఐపీఎల్ 2022లో బౌలర్‌గా అంతగా పెద్ద ప్రభావం చూపకపోయినప్పటికీ.. మంచి ఎకానమీ మాత్రం మెయింటెన్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌ తరఫున ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ 7.14 ఎకానమీ రేటుతో 14గేమ్‌లలో 11 వికెట్లు పడగొట్టాడు.

అయితే అశ్విన్ కేవలం బౌలింగ్ మాత్రమే కాకుండా తనలోని బ్యాటింగ్ నైపుణ్యాన్ని కూడా జట్టు తరఫున ప్రదర్శించాడు. అశ్విన్ బ్యాటింగ్‌ను గవాస్కర్ ప్రశంసలతో ముంచెత్తాడు. 10ఇన్నింగ్స్‌లలో 30.50సగటుతో 183పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేటు సైతం 146.40గా ఉండడం గమనార్హం. అతను తన ఇన్నింగ్స్‌లో ఒక హాఫ్ సెంచరీ కూడా సాధించాడు.

టీ20ల్లో కూడా రాణించగలనని చూపిస్తున్నాడు

టీ20ల్లో కూడా రాణించగలనని చూపిస్తున్నాడు

ఇకపోతే శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ తనలోని బ్యాటింగ్ సత్తాను చూపించాడు. అజేయంగా 23 బంతుల్లో 40పరుగులు చేశాడు. తద్వారా ఆర్ఆర్ ఐదు వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. ఈ గెలుపుతో లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచి క్వాలిఫయర్ 1కు అర్హత సాధించింది. అతని బ్యాటింగ్ ప్రదర్శనను గవాస్కర్ ప్రశంసిస్తూ.. 'అతను ఏ ఫార్మాట్లోనైనా బ్యాటింగ్ చేయగలడని చూపించాలనుకుంటున్నాడు.

అతను తన కెరీర్‌ను ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ప్రారంభించాడు. ఫస్ట్ క్లాస్ స్థాయిలోనే కాదు, క్లబ్ స్థాయిలో కూడా బ్యాటర్ గా రాణించాడు. ఇప్పుడు అత్యుత్తమ స్పిన్నర్లలో అశ్విన్ ఒకడిగా మారాడు. అతను 5 టెస్టు సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్. కాబట్టి అతను బ్యాటింగ్ చేయగలడు. అతను ఇప్పుడు టీ20 ఫార్మాట్లో కూడా రాణించగలడని చూపిస్తున్నాడు.' అని పేర్కొన్నాడు.

టీమిండియాకు ఛాయిస్ కాదు అవసరమయ్యేలా అశ్విన్

టీమిండియాకు ఛాయిస్ కాదు అవసరమయ్యేలా అశ్విన్

'అశ్విన్ తన ప్రదర్శనతో ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచ కప్‌లో భారత జట్టులో ఉండగలనని చూపిస్తున్నాడు. అదే అతని లక్ష్యం అయి ఉంటుంది. అతను తన సొంత బ్యాటింగ్ ప్రదర్శన గురించి చాలా ఉత్సుకతతో ఉన్నాడు. అతను బౌలింగ్, బ్యాటింగ్ నైపుణ్యాలతో తనని తీసుకోవాల్సిన అవసరముందనేలా చేస్తున్నాడు అని గవాస్కర్ పేర్కొన్నాడు.

ఇకపోతే మే 24న ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్ 2లో మే 27న తలపడనుంది. ఇక క్వాలిఫయర్ 1 వర్షం వల్ల గనుక రద్దయితే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరుతుంది. రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.

Story first published: Monday, May 23, 2022, 15:34 [IST]
Other articles published on May 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X