న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత క్రికెట్‌ చరిత్రలోనే ఎవరి వల్ల కాలేదు.. విరాట్ ఒక్కడే చేయగలడు: గౌతమ్ గంభీర్

Gautam Gambhir says Virat Kohli has a huge role in ODI World Cup 2023

న్యూఢిల్లీ: అవకాశం దొరికినప్పుడల్లా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై విరుచుకుపడే మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. తొలిసారి అతని గురించి సానుకూల వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ కీలకం కానున్నాడని తెలిపాడు. భారత క్రికెట్‌లో ఇప్పటి ఎవరు కూడా రెండు ప్రపంచకప్‌లు గెలవలేదని, విరాట్ కోహ్లీ ఒక్కడికే ఆ అవకాశం ఉందని తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ 'క్రికెట్ కా మహాకుంబ్'కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్‌ను అప్‌కమింగ్ వన్డే ప్రపంచకప్‌లో విరాట్ పాత్రపై ప్రశ్నించగా.. ఈ వ్యాఖ్యలు చేశాడు.

 కోహ్లీ ఒక్కడే..

కోహ్లీ ఒక్కడే..

'మళ్లీ మళ్లీ ప్రపంచకప్ ఆడే అవకాశం అతికొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. యూసఫ్ పఠాన్, నేను ఒక్క వన్డే ప్రపంచకప్ మాత్రమే ఆడాము. అప్‌కమింగ్ వరల్డ్ కప్ విరాట్ కోహ్లీకి నాలుగోది. దేశం తరఫున రెండు ప్రపంచకప్‌లు గెలవడం కంటే గొప్ప అచీవ్‌మెంట్ ఏది ఉండదు. చాలా తక్కువ మంది మాత్రమే రెండు ప్రపంచకప్ మెడల్స్ అందుకున్నారు. విరాట్ కోహ్లీ ముందు ఆ రికార్డు వేచి ఉంది. వ్యక్తిగత రికార్డులు ముఖ్యమే. చేసిన పరుగులు కెరీర్ ఎండ్‌లో సంతోషాన్నిస్తాయి. కానీ ఎన్ని ప్రపంచకప్‌లు గెలిచామన్నదే ఓ ప్లేయర్‌గా ఏం సాధించామని చెప్పడానికి పారామీటర్.

రోహిత్, కోహ్లీ అనుభవం..

రోహిత్, కోహ్లీ అనుభవం..

వన్డే వరల్డ్ కప్‌ 2023 టోర్నీలో విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించబోతున్నారు. వారి అనుభవం జట్టుకు చాలా ఉపయోగపడనుంది. యువ ఆటగాళ్లు అయిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్‌లు ఎంపిక చేస్తే వారికి ఇదే తొలి ప్రపంచకప్ అవుతుంది. కాబట్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అనుభవం కీలకం కానుంది. టీ20, టెస్ట్‌ల కంటే వన్డే ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ పాత్ర కీలకం కానుందనేది నా అభిప్రాయం. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలికి సరిగ్గా సరిపోయే ఫార్మాట్ ఇది.'అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఐసీసీ టైటిళ్లు గెలవకపోవడం..

ఐసీసీ టైటిళ్లు గెలవకపోవడం..

కెప్టెన్‌గా అత్యధిక విజయాలందించిన విరాట్.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం విఫలమయ్యాడు. ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయాడు. కోహ్లీ సారథ్యంలో భారత్ 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓడగా.. డబ్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలోనే ఓడింది. 2021 ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే వెనుదిరిగింది. దాంతో అతని కెప్టెన్సీపై వేటు వేసిన బీసీసీఐ.. రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక రోహిత్, కోహ్లీకి వన్డే ప్రపంచకప్ చివరి అవకాశం కానుంది. ఈ టోర్నీ గెలవకుంటే వారి కెరీర్‌లకు ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంది.

Story first published: Thursday, January 5, 2023, 22:21 [IST]
Other articles published on Jan 5, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X