న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సురేశ్ రైనా లేడుగా.. ధోనీని ఫస్ట్ డౌన్‌లో ఆడించాలి: గౌతమ్ గంభీర్

 Gautam Gambhir Says MS Dhoni should bat at No 3 in Suresh Raina’s absence

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నుంచి టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ సురేశ్ రైనా తప్పుకున్న విషయం తెలిసిందే. కరోనా భయం, కుటుంబంపై బెంగ, సన్నిహితుల మరణం... ఫ్రాంచైజీతో విభేదాలు రైనా నిష్క్రమణకు కారణాలనే ప్రచారం జరుగుతుంది. అయితే రైనా గైర్హాజరీ నేపథ్యంలో సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఫస్ట్ డౌన్‌లో ఆడించాలని భారత మాజీ ఓపెనర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు.

ధోనీకిదే గుడ్ చాన్స్..

ధోనీకిదే గుడ్ చాన్స్..

స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న ఈ టూ టైమ్ ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్.. ధోనీకి ఇది మంచి అవకాశమని చెప్పుకొచ్చాడు. ‘నెంబర్ 3లో బ్యాటింగ్ చేయడానికి ధోనీకిదే సువర్ణావకాశం. అలాగే గత ఏడాదిగా అతను ఆటకు దూరంగా ఉన్నాడు. కాబట్టి బంతులను ఎక్కువగా వృథా చేస్తూ యాంకర్ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా భారత తరఫున అలానే ఆడాడు. కాబట్టి ధోనీ ఫస్ట్ డౌన్‌లో వస్తే ఆ సమస్యను అధిగమించవచ్చు.

 లోయరార్డర్‌లో సమస్య లేదు...

లోయరార్డర్‌లో సమస్య లేదు...

ఒక వేళ ధోనీ మూడో స్థానంలో వచ్చినా.. కేదార్ జాదవ్, డ్వేన్ బ్రావో, సామ్ కరన్‌లతో లోయరార్డర్ బలంగా ఉంటుంది. కాబట్టి ధోనీ వంటి ఆటగాడికి ఇది గొప్ప అవకాశమని నా అభిప్రాయం. అతను కూడా ఈ స్థానంలో ఆడటాన్ని ఆస్వాదిస్తాడని అనుకుంటున్నా. అలాగే సురేశ్ రైనా దూరమవడంతో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయడానికి సీఎస్‌కేకు ఓ అనుభవజ్ఞుడైన ఆటగాడు అవసరం. కాబట్టి అది ధోనీ అయితే ఇంకా బాగుంటుంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ధోనీకి అంత సులువేం కాదు..

ఏడాదిగా ఆటకు దూరమైన ధోనీకి ఐపీఎల్‌లో ఆడటం అంత సులువేం కాదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. తగిన ప్రాక్టీస్ లేకుండా ప్రపంచస్థాయి బౌలర్లను ఎదుర్కోవడం సవాల్‌తో కూడుకున్నదన్నాడు. ‘ధోనీ ఏడాదిగా ఆటకు దూరమయ్యాడు. కాబట్టి ప్రాపర్ క్రికెట్ టోర్నీ అయిన ఐపీఎల్‌లో రాణించడం అతనికి అంత సులువు కాదు. ఎందుకంటే ఈ టోర్నీ‌లో నాణ్యమైన క్రికెట్ ఉంటుంది. అంతర్జాతీయ క్వాలిటీ బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం. ఏడాదిగా ఆటకు దూరంగా ఉన్న పరిస్థితుల్లో పూర్వవైభవం అందుకోవాలంటే చాలా ప్రాక్టీస్ అవసరం'అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, August 31, 2020, 21:11 [IST]
Other articles published on Aug 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X