న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ తన ఆదాయంలో సగం ఇచ్చినా.. భారత్‌కు పతకాలే పతకాలు: గంభీర్

Gautam Gambhir says BCCI should give 50% of revenue to Olympic sports

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి వచ్చే ఆదాయంలో సగం ఇరత క్రీడలకు పంచితే దేశానికి పతకాల పంట పండుతుందని మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నాడు.

బీసీసీఐన ఆర్జిస్తున్న ఆదాయంలో క్రికెటర్ల జీతాలు, ఇతరత్రా ఖర్చులకు యాభై శాతం సరిపోతుందన్నాడు. 130 కోట్ల జనాభా కలిగిన భారత దేశంలో క్రికెట్‌ను ఓ మతంలా ఆరాదిస్తారన్న విషయం తెలిసిందే. దేశంలో క్రికెట్‌కు ఉన్న ఈ క్రేజ్‌.. బీసీసీఐ పంట పండిస్తోంది. బ్రాడ్ కాస్టింగ్ హక్కులతో పాటు స్పాన్సర్లు, మ్యాచ్‌ల నిర్వహణతో భారీ మొత్తంలో బోర్డుకు ఆదాయం చేకూరుతోంది.

రిచెస్ట్ బోర్డు..

రిచెస్ట్ బోర్డు..

ఐసీసీ సభ్యత్వం ఉన్న 12 దేశాలు, అనుబంధ సభ్యత్వం ఉన్న మరికొన్ని దేశాలలో క్రికెటర్లకు ఎక్కడా లేని జీతాలు మన క్రికెటర్లకు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో అయితే కుర్రాళ్లకు కాసుల పంటే. ఒక్క ఐపీఎల్‌తో బీసీసీఐ ప్రపంచ క్రికెట్‌ను కనుసైగ ద్వారా శాసిస్తున్నది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ ఏకంగా రూ. 48 వేల కోట్లు ఆర్జించిన విషయం తెలిసిందే. ఏటికేడు తన ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్న బీసీసీఐ.. ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా ఉంది. రెండు కోత్త జట్లతో రూ.12వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టింది.

సగం ఆదాయం ఇస్తే..

సగం ఆదాయం ఇస్తే..

ప్రపంచంలోనే రిచెస్ట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ.. తన ఆదాయంలో యాభై శాతాన్ని ఇతర క్రీడలకు వెచ్చిస్తే బాగుంటుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

అలా చేస్తే దేశానికి ఒలింపిక్స్‌లో పతకాల పంట పండటం ఖాయమని తెలిపాడు. 'బీసీసీఐ ప్రతీ ఏడాది తన ఆదాయాన్ని పెంచుకుంటున్నది. అయితే అది తన ఆదాయంలో 50 శాతం ఒలింపిక్ క్రీడలకు పంచితే బాగుంటుంది. ఎందుకంటే క్రికెట్ నుంచి బీసీసీఐ ఆర్జిస్తున్న ఆదాయంలో క్రికెటర్ల జీతాలు, ఇతరత్రా ఖర్చులకు యాభై శాతం చాలు. మిగిలిన యాభై శాతం ఇతర క్రీడలు, క్రీడాకారులకు వెచ్చించాలి.

ఒడిశా తరహాలో..

ఒడిశా తరహాలో..

రానున్న రోజుల్లో దేశాభివృద్దికి క్రీడలు ఎంతగానో దోహదం చేయనున్నాయి. దేశంలో పిల్లలను ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు బానిసలను చేయడం కంటే శారీరక దారుఢ్యం పెంచుకునే క్రీడల వైపునకు మళ్లించడం ఎంతో ముఖ్యం. భారత్‌లో ఒడిశా రాష్ట్రం హాకీని చాలా బాగా ప్రోత్సహిస్తున్నది.

ఒడిశా మాదిరిగానే ప్రతీ రాష్ట్రం కూడా ఒక్కో క్రీడను ఎంకరేజ్ చేయాలి. క్రీడాకారులను గుర్తించి వారికి మంచి శిక్షణ, మౌళిక వసతులు కల్పించాలి. అలా చేస్తే మనం ఊహించిన ఫలితాలు వస్తాయి. ఒలింపిక్స్‌లో భారత్ కు పతకాల పంట పండటం ఖాయం.'అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Sunday, November 27, 2022, 19:20 [IST]
Other articles published on Nov 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X