న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీకి నాకు మధ్య పొరపచ్చాలేమీ లేవు'

Gautam Gambhir clears air on his relationship with MS Dhoni, expresses sorrow over 2015 World Cup snub

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ, గంభీర్‌ మధ్య విభేదాలున్నాయని ఎంతోకాలంగా ప్రచారంలో ఉంది. అయితే, రిటైర్మెంట్‌కు సిద్ధమైన గంభీర్‌ వాటికి తెరదించాడు. ధోనీతో తనకు ఎటువంటి స్పర్థలూ లేవని స్పష్టం చేశాడు. 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో హీరోగా నిలిచిన గౌతీ.. 2015 మెగా టోర్నీలో భారత జట్టులో చోటు దక్కించుకోలేక పోయాడు.

టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర

టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర

‘నాతోపాటు ఆడిన వారు 2-3 వరల్డ్‌కప్‌ల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించారు. కానీ నాకు మాత్రం ఆ అవకాశం ఒక్కసారే దక్కినందుకు ఎంతో బాధేసింది. కానీ జట్టు టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. టైటిల్ సాధించడంలో జట్టు కీలక పాత్ర పోషించడం కంటే గొప్ప అవకాశం మరొకటి ఉండదని భావిస్తున్నా. ' అని గంభీర్‌ చెప్పాడు.

కెరీర్‌లోనే ఆఖరి ప్రొఫెషనల్ మ్యాచ్‌గా

కెరీర్‌లోనే ఆఖరి ప్రొఫెషనల్ మ్యాచ్‌గా

రిటైర్మెంట్ గురించి ప్రకటించిన సమయంలో గంభీర్ ఒక్కసారి కూడా ఈ వివాదాల గురించి బయటపడకపోవడం గమనార్హం. ప్రస్తుతం గురువారం నుంచి జరుగుతున్న ఆంధ్రతో రంజీ మ్యాచ్‌లో గంభీర్‌కు కెరీర్‌లో ఆఖరి ప్రొఫెషనల్ మ్యాచ్‌గా నిలవనుంది. రిటైర్మెంట్ అనంతరం గంభీర్ రాజకీయాల్లోకి రానున్నాడని సమాచారం. ఇప్పటికే ఆసక్తిగా ఉందని తెలిపిన సందర్భాలు లేకపోలేదు.

గంభీర్ కెరీర్‌లో నిలిచిన హైలెట్స్

గంభీర్ కెరీర్‌లో నిలిచిన హైలెట్స్

దూకుడైన ఓపెనర్‌గా పేరున్న ఈ ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో భారత టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ధోని నేతృత్వంలో భారత్‌ ఈ రెండు కప్పులూ గెలిచిన సంగతి తెలిసిందే. గంభీర్‌ భారత్‌ తరపున 58 టెస్ట్‌లు, 147 వన్డేలు, 37 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. ‘ఆంధ్రతో ఢిల్లీ ఆడబోయే తర్వాతి రంజీ మ్యాచే నా కెరీర్‌లో ఆఖరిది. నా కెరీర్‌ మొదలైన ఫిరోజ్‌ షా కోట్లాలోనే నా ప్రస్ధానం ముగియనుంది' అని సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియోలో గంభీర్‌ తెలిపాడు.

Story first published: Friday, December 7, 2018, 9:05 [IST]
Other articles published on Dec 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X