న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏడు నిమిషాల్లోనే టీమిండియాకు కోచ్‌నయ్యా: గ్యారీ క్రిస్టన్‌

Gary Kirsten recalls how he landed India coachs job in seven minutes

న్యూ ఢిల్లీ: గ్యారీ క్రిస్టన్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 28 ఏళ్ల భారత కలను సాకారం చేసిన ద్రోణాచార్యుడు. 2011 ప్రపంచకప్‌ టోర్నీలో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టును విశ్వవిజేతగా నిలిపిన ఘనుడు. అంతటి అద్భుత విజయాన్నందించిన ఈ కోచ్‌ను కేవలం ఏడంటే ఏడు నిమిషాల్లోనే బీసీసీఐ ఎంపిక చేసిందంట.! అవును ఈ విషయాన్ని ఈ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటరే తెలిపాడు. తనకు టీమిండియా కోచ్‌ పదవి ఎలా వరించిందో తాజాగా గుర్తు చేసుకున్నాడు. క్రికెట్‌ కలెక్టివ్‌ ప్యాడ్‌కాస్ట్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ వరల్డ్‌కప్ విన్నింగ్ కోచ్ ఈ విషయాలను వెల్లడించాడు.

జోక్ చేయడం లేదు కదా..

జోక్ చేయడం లేదు కదా..

టీమిండియా కోచ్ ఆఫర్ గురించి తనకు సునీల్ గావస్కర్ ఈమెయిల్ ద్వారా తెలియజేశాడని క్రిస్టన్ గుర్తు చేసుకున్నాడు. ‘నాకు ఇండియన్‌ క్రికెట్‌ టీం కోచ్‌ ఎంపిక ప్యానెల్‌లో ఉన్న సునీల్‌ గావస్కర్‌ నుంచి ఈమెయిల్‌ వచ్చింది. నువ్వు మా జట్టుకు కోచ్‌గా చేస్తావా? అని గవాస్కర్‌ అడిగాడు. జోక్‌ చేయడం లేదు గదా అని నేనన్నా. ఆయన వెంటనే ఇంటర్వ్యూకు ఆహ్వానించాడు. ఇదే విషయం నా భార్యకు చెబితే నీకు అంత సీన్ లేదంది'అని క్రిస్టన్‌ తెలిపాడు.

కుంబ్లే ఓ నవ్వు నవ్వాడు..

కుంబ్లే ఓ నవ్వు నవ్వాడు..

తాను భారత్ వెళ్లీ ఇంటర్వ్యూ కోసం బీసీసీఐ కార్యాలయంలో కి వెళ్లేటప్పుడు అప్పటి భారత కెప్టెన్‌ అనిల్‌కుంబ్లే ఎదురయ్యాడని క్రిస్టన్‌ గుర్తు చేసుకున్నాడు. ‘నువ్విక్కడేం చేస్తున్నావ్‌'అని కుంబ్లే ప్రశ్నించాడని, ‘మీకు శిక్షణ ఇచ్చేందకు ఇంటర్వ్యూకు వచ్చాను'అని తాను సమాధానమివ్వగానే కుంబ్లే ఓ నవ్వు నవ్వడాని చెప్పుకొచ్చాడు.

కోచ్‌ ఎంపిక ప్యానెల్‌ తనను ఏడు నిమిషాలు ఇంటర్వ్యూ చేసిందని గుర్తుచేసుకున్నాడు.

సఫారీపై స్ట్రాటజీ చెప్పా..

సఫారీపై స్ట్రాటజీ చెప్పా..

బీసీసీఐ కార్యదర్శితోపాటు ప్యానెల్‌ మెంబర్‌ రవిశాస్త్రి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చానని తెలిపాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా జట్టు ఇండియాతో తలపడ్డప్పుడు విజయానికి తన దగ్గర ఉన్న వ్యూహాలను వివరించానని, దానికి సంతృప్తి చెంది కోచ్‌ పదవి అప్పగించారన్నారు. అలా ఎలాంటి దరఖాస్తు చేయకుండానే కేవలం ఏడు నిమిషాల ఇంటర్వ్యూ ద్వారా ఇండియన్‌ టీం కోచ్‌గా ఎంపికయ్యానని గ్యారీ గుర్తుచేసుకున్నాడు.

కాంట్రాక్టులో నాపేరు లేదు..

కాంట్రాక్టులో నాపేరు లేదు..

ఇక బీసీసీ సెకట్రరీ నాకు ఇచ్చిన కాంట్రాక్టు పేపర్లలో తన పేరు లేదని, అక్కడ పాత కోచ్ గ్రేగ్ చాపెల్ రాసి ఉందన్నాడు. వెంటనే ఈ విషయాన్ని సెక్రటరీకి చెబుతూ...‘సర్.. మీరు ఈ కాంట్రాక్ట్‌ను మునపటి కోచ్‌కు ఇచ్చారు.'అని చెప్పా. వెంటనే అతను తన వైపు ఓలుక్కేసీ.. జేబులో నుంచి పెన్ను తీసి చాపెల్ పేరు కొట్టేసి క్రిస్టన్ అని రాసాడని తెలిపాడు. ఇక, గ్యారీ క్రిస్టన్‌ 2008 నుంచి 2011 వరకు భారత జట్టు కోచ్‌గా పనిచేశాడు. అతడి కృషి వల్లే మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత్ 2011 ప్రపంచకప్ గెలిచింది.

2009లో అత్యుత్తమ ర్యాంకు అందుకుంది.

2003 ప్రపంచకప్ ఫైనల్లో భారత ఓటమికి అదే కారణం: మాజీ పేసర్

Story first published: Monday, June 15, 2020, 20:21 [IST]
Other articles published on Jun 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X