న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షోయబ్ అక్తర్‌కు శస్త్రచికిత్స.. నొప్పిగా ఉందంటూ వీడియో పోస్టు!!

Shoaib Akhtar Undergoes Successful Knee Surgery In Australia
Former Pakistan pacer Shoaib Akhtar undergoes successful knee surgery in Melbourne

మెల్‌బోర్న్: పంచంలోనే అత్యంత వేగవంతమైన పేసర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌కు శస్త్రచికిత్స జరిగింది. గురువారం షోయబ్ అక్తర్‌ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అభిమానులకు అప్‌డేట్ ఇవ్వడానికి అక్తర్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. కొంచెం నొప్పిగా ఉంది అయినా త్వరగా కోలుకుంటానని అక్తర్ పేర్కొన్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శ్రీలంక 'మిస్టరీ స్పిన్నర్‌'అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శ్రీలంక 'మిస్టరీ స్పిన్నర్‌'

కొంచెం నొప్పిగా ఉంది:

'నా మోకాలి శస్త్రచికిత్స ఆస్ట్రేలియాలో విజయవంతంగా పూర్తయింది. నాపై ప్రేమ ఉన్న అభిమానుల కోసం ఒక చిన్న వీడియోను తయారు చేసాను. మీ అందరి సహకారం కావాలి' అని ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. ఇక వీడియోలో మాట్లాడుతూ... ' ప్రస్తుతం బాగానే ఉన్నా. నా మోకాలికి శస్త్రచికిత్స విజయవంతం అయింది. నేను కోలుకుంటున్నాను. కొంచెం నొప్పిగా ఉంది. అయినా త్వరగా కోలుకోవాలని అందరూ ఆశీర్వదించండి' అంటూ అక్తర్ పేర్కొన్నారు. శస్త్రచికిత్సకు ముందు కూడా అక్తర్ ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 44 ఏళ్ల అక్తర్ 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడారు.

మ్యాచ్‌ విన్నర్‌గా నిలుస్తాడు:

మ్యాచ్‌ విన్నర్‌గా నిలుస్తాడు:

విండీస్‌తో జరిగిన టెస్టు జట్టులో రోహిత్‌ శర్మ లేకపోవడంపై తాజాగా అక్తర్ మాట్లాడుతూ... 'టెస్టు క్రికెట్‌లో రోహిత్‌ శర్మ పెద్ద మ్యాచ్‌ విన్నర్‌గా నిలుస్తాడు. టెస్టు జట్టులో అతడిని ఎంపిక చేసి తుది జట్టులోకి తీసుకోకపోతే.. అది తప్పే. టెస్టుల్లో ఆడటానికి రోహిత్‌కు గతంలో అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు బాగా ఆడతాడనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. నిరూపించుకోడానికి టీమిండియా అవకాశమివ్వాలి' అని సూచించారు.

జాతీయ క్రీడా పురస్కారాలు.. బజరంగ్, జడేజాలు గైహాజరు!!

 ఆర్చర్‌ది సరైన పద్ధతి కాదు:

ఆర్చర్‌ది సరైన పద్ధతి కాదు:

యాషెస్‌ రెండో టెస్టులో ఆర్చర్ వేసిన బంతికి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు బలమైన గాయమైన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో గాయపడ్డ స్మిత్‌ను ఆర్చర్‌ పరామర్శించకుండా నవ్వుతూ ఉన్నాడు. దీనిపై అక్తర్ స్పందించారు. 'ఆటలో బౌన్సర్‌ ఒక భాగం. కానీ.. దాని వల్ల బ్యాట్స్‌మన్‌కు గాయమై కుప్పకూలితే.. బౌలర్‌ అతడి వద్దకు వెళ్లి గాయాన్ని పరిశీలించాలి. నొప్పితో బాధపడుతున్న స్మిత్‌ను ఆర్చర్ పరామర్శించకుండా దూరంగా ఉన్నాడు. ఇది సరైన పద్ధతి కాదు' అని మండిపడ్డారు.

Story first published: Thursday, August 29, 2019, 12:47 [IST]
Other articles published on Aug 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X