న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ రిటైర్మెంట్‌కు అదే కారణం: ఆర్పీ సింగ్

Former India Pacer RP Singh reveals the reason behind MS Dhoni retiring from international cricket

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరిగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడటమే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌కు కారణమని టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ కోసం మహీ ఇన్నాళ్లు వేచి చూసాడని కానీ అది జరగకపోవడంతో ఆటకు వీడ్కోలు పలికాడని చెప్పుకొచ్చాడు. అతని వయసు, ఫిట్‌నెస్ కూడా ధోనీని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేలా చేశాయన్నాడు. ఓ క్రికెట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

'టీ20ల్లో ధోనీ అసాధారణమైన ఆటగాడు. టీ20 ప్రపంచకప్ కోసం అతను వేచి చూడాలనుకున్నాడు. కానీ కరోనా కారణంగా వాయిదా పడటంతో ఫిట్ నెస్, వయసును పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయాన్ని ప్రకటించాడు. ఐపీఎల్‌‌ను పక్కన పెడితే గత 12-15 నెలలుగా భారత్ తరఫున ఆడే అవకాశమే అతనికి దక్కలేదు. ఇక 2019 ప్రపంచకప్‌లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకున్నాడు. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ అతన్ని లోయరార్డర్‌లో ఆడించింది. ఇక సెమీ ఫైనల్‌ వరకు బ్యాటింగ్ చేసే అవకాశం కూడా పెద్దగా రాలేదు. ఇక విచిత్రమైన విషయం ఏంటంటే మునపటిలా అతను మ్యాచ్‌ను ముగించలేకపోయాడు. బహుశా అది కూడా అతన్ని రిటైర్మెంట్ తీసుకునేలా చేయవచ్చు. కెరీర్ ముగింపుకు చేరుకుందనే సంకేతాన్ని ఇవ్వవచ్చు'అని ఆర్పీ సింగ్ చెప్పుకొచ్చాడు.

2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ చెప్పినట్లు చేయడంతోనే తాను పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ కమ్రాన్ అక్మల్(0) వికెట్ తీయగలిగానన్నాడు. దాంతో మహీ అంటే సాధారణ ఆటగాడు కాదనే విషయం తెలిసొచ్చిందని పేర్కొన్నాడు. '2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ అంటే ఏంటో తెలిసింది. అతడో ప్రత్యేకమైన ఆటగాడనిపించింది. ఆ టోర్నీలో అతడు బ్యాటింగ్‌తో అదరగొట్టకపోయినా ప్రతీ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో కమ్రాన్ అక్మల్ బ్యాటింగ్‌కు వచ్చాక క్రీజులో కాలు కదపడం లేదని ధోనీ నాకు చెప్పాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే అక్మల్‌ను బౌల్డ్ చేయవచ్చని సలహా ఇచ్చాడు. అలానే బౌలింగ్ చేయడంతో కమ్రాన్ బౌల్డ్ అయ్యాడు. ఆ క్షణమే ధోనీ అసాధారణ ఆటగాడు అనిపించింది'అని ఈ మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు. భారత స్వాతంత్ర్యదినోత్సవం రోజున చడిచప్పుడు లేకుండా సింపుల్‌గా ఓ ఇన్‌స్టా పోస్ట్‌తో ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 'కెరీర్‌ ఆసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని మహీ ఓ వీడియో షేర్ చేశాడు.

సౌరవ్ గంగూలీ టీ20 క్రికెట్‌కు పనికిరాడు.. కేకేఆర్ మాజీ కోచ్ వివాదాస్పద వ్యాఖ్యలు!సౌరవ్ గంగూలీ టీ20 క్రికెట్‌కు పనికిరాడు.. కేకేఆర్ మాజీ కోచ్ వివాదాస్పద వ్యాఖ్యలు!

Story first published: Sunday, August 30, 2020, 20:46 [IST]
Other articles published on Aug 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X