మ్యాచ్‌ ఫీజుల్లేవ్: రంజీ క్రికెటర్లకు బీసీసీఐ మొండిచేయి

Posted By:
For two seasons, Ranji players have not been paid match fees by BCCI

హైదరాబాద్: బీసీసీఐ.. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు. ఏటా దీని ఆదాయం వేల కోట్లలోనే ఉంటుంది. ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకున్న అనామక ఆటగాళ్లు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారుతున్నారు. అలాంటి బోర్డు నేతృత్వంలో ఉన్న రంజీ ఆటగాళ్లకు రెండు సీజన్ల నుంచి మ్యాచ్‌ ఫీజులు మాత్రం చెల్లించట్లేదు.

 ఐపీఎల్‌తో కోట్లు కొల్లగొడుతూ..:

ఐపీఎల్‌తో కోట్లు కొల్లగొడుతూ..:

ఐతే ఆటగాళ్లకు డబ్బులివ్వంది కోట్లు సంపాదిస్తోన్న బోర్డు దగ్గర నిధుల్లేక కాదు. ఇందుకు కారణం వేరు. లోధా సంస్కరణల అమలులో వివిధ రాష్ట్రాల క్రికెట్‌ సంఘాలు మీనమేషాలు లెక్కిస్తుండటంతో వినోద్‌ రాయ్‌ నేతృత్వంలోని బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) వాటికి నిధులు విడుదల చేయలేదు.

 బోర్డు ఉదాసీన వైఖరిపై విమర్శలు:

బోర్డు ఉదాసీన వైఖరిపై విమర్శలు:

దీంతో యువ ఆటగాళ్లపట్ల బోర్డు ఉదాసీన వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పర్యవసానంగా చాలా సంఘాలు నిధుల లేమితో కటకటలాడుతున్నాయి. రంజీ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లకు ఇవ్వాల్సిన మ్యాచ్‌ ఫీజుల్లో మెజారిటీ బీసీసీఐ నుంచే రావాలి.

పూర్తిగా ఎవరికీ మ్యాచ్‌ ఫీజులు అందలేదు:

పూర్తిగా ఎవరికీ మ్యాచ్‌ ఫీజులు అందలేదు:

రాష్ట్ర సంఘాల్లో లోధా సంస్కరణలు అమలు కాకపోవడంతో ఆ నిధులు కూడా బోర్డు విడుదల చేయలేదు. కొన్ని సంఘాలు తమ దగ్గరున్న నిధులతో ఆటగాళ్లకు కొంతమేర చెల్లింపులు చేశాయి. కానీ పూర్తిగా ఎవరికీ మ్యాచ్‌ ఫీజులు అందలేదు. చాలామంది ఆటగాళ్లు అసలేమాత్రం ఫీజులు అందుకోలేదు.

 కొత్త విధానం కూడా ఓ కారణమే:

కొత్త విధానం కూడా ఓ కారణమే:

దాదాపు 500 మంది ఆటగాళ్లకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇదే కాకుండా, ప్రస్తుతం ఆటగాళ్లకు కొత్త చెల్లింపుల విధానంపై సీఓఏ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

-------------------------------------------------------------------------------------

Story first published: Wednesday, March 7, 2018, 11:32 [IST]
Other articles published on Mar 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి