న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నై జట్టు.. ధోనీ కోసమే కప్ గెలుస్తుంది: రైనా

For old times sake, Raina wants to win IPL for Dhoni

హైదరాబాద్: ఐపీఎల్‌ 11వ సీజన్‌లో చెన్నై ఫైనల్‌కు చేరిపోయింది. శుక్రవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండింటిలో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్‌లో చెన్నై‌తో పోరాడాలి. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు భారీగా సమాయత్తమవుతోంది. ఇప్పటికే ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ఏడోసారి ఫైనల్ చేరింది. ఆ జట్టు ఆడిన 9 ఏళ్లలో ఏడుసార్లు ఫైనల్ చేరగా రెండుసార్లు కప్ గెలిచింది.

కప్ గెలుస్తామని, ధోనీకి గిఫ్ట్‌గా ఇస్తామని

కప్ గెలుస్తామని, ధోనీకి గిఫ్ట్‌గా ఇస్తామని

ఈసారి ఎలాగైనా కప్ గెలుస్తామని, ధోనీకి గిఫ్ట్‌గా ఇస్తామని ఆ జట్టులోని కీలక ఆటగాడు సురేశ్ రైనా చెప్పాడు. ‘ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ చేరగానే ధోనీ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. చెన్నై జట్టు గురించి అతడెంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాడు. 2008 నుంచి సూపర్ కింగ్స్‌ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. నాకు తెలిసిన వాళ్లలో మంచితనం గురించి మాట్లాడాలంటే ధోనీ తర్వాతే ఎవరైనా. కాబట్టే, ఈసారి మేం ధోనీ కోసమే ఐపీఎల్ గెలవాలని అనుకుంటున్నాం' అని రైనా తెలిపాడు.

చెన్నై జట్టు ముప్పై దాటిన వారిని జట్టులోకి

చెన్నై జట్టు ముప్పై దాటిన వారిని జట్టులోకి

ఈసారి వేలం ముగిశాక చెన్నై జట్టు పెద్ద వయస్కులను జట్టులోకి తీసుకుందని ఎక్కడో చదివాను. కానీ ఆటగాళ్ల అనుభవాన్ని మేం సద్వినియోగం చేసుకుంటున్నాం. మా జట్టు ఎంతో నమ్మకంగా ఉంది. షేన్ వాట్సన్, రాయుడు చక్కటి ఆరంభాలు ఇచ్చారు. తర్వాత ధోనీతో కలిసి నేను బాగా ఆడాను. అంతా కలిసి ఓ జట్టుగా రాణించాం. మా అనుభవం ఉన్న ఆటగాళ్లతో కూడిన జట్టే కాదు మ్యాచ్ విన్నర్లున్న జట్టు కూడా. 2011 నుంచి మేం టైటిల్ గెలవలేదు. అందుకే ఈసారి గెలవాలనుకుంటున్నాం'' అని రైనా చెప్పాడు.

చెన్నై జెర్సీ ఒంటి మీద పడగానే..

చెన్నై జెర్సీ ఒంటి మీద పడగానే..

రెండేళ్లు పూణె తరఫున ఆడిన మహీ.. బ్యాట్‌తో రాణించడానికి ఇబ్బంది పడ్డాడు. కానీ ఈ సీజన్లో చెన్నై జెర్సీ ఒంటి మీద పడగానే.. ధోనీలోని ఆటగాడు మళ్లీ బయటకొచ్చాడు. ఈ సీజన్లో 150కిపైగా స్ట్రయిక్ రేట్‌తో ఇప్పటికే 455 రన్స్ చేశాడు. కెప్టెన్‌గానూ తనవైన వ్యూహాలతో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు.

చెన్నైతో పాటు కోల్‌కతా

చెన్నైతో పాటు కోల్‌కతా

ఆఖరి మ్యాచ్‌లో అప్పటికే ప్లేఆఫ్ బెర్తు ఫిక్సయిపోయిన చెన్నైతో ప్లేఆఫ్ బరిలో నిలవాలని పంజాబ్ తలపడింది. చెన్నై చేధనలో బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో గెలిచేశారు. దీంతో పంజాబ్ ఇంటి దారి పట్టింది. చెన్నైతో పాటు కోల్‌కతా లేదా హైదరాబాద్ జట్లు ముంబై వేదికగా ఫైనల్ మ్యాచ్‌లో తలపడతాయి.

Story first published: Friday, May 25, 2018, 13:21 [IST]
Other articles published on May 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X