న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌కు గుడ్‌బై: డివిలియర్స్ ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఇవే..

By Nageshwara Rao

హైదరాబాద్: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 34 ఏళ్ల డివిలియర్స్ మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం తన ట్విట్టర్‌లో వీడియో మేసెజ్ ద్వారా ప్రకటించాడు.

2004లో ఇంగ్లాండ్‌పై టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డివిలియర్స్‌.. చివరగా ఈ ఏడాది ఏప్రిల్‌ 3న ఆస్ట్రేలియాతో జొహానెస్‌బర్గ్‌లో తన చివరి టెస్టు ఆడాడు. 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20ల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు.

అంతర్జాతీయ క్రికెట్లో 20,014 పరుగులు చేశాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్లలో క్రికెట్‌ చరిత్రలోనే ఏబీ డివిలియర్స్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లో ఒకడు. అలాంటి ఏబీ డివిలియర్స్ క్రికెట్ కెరీర్‌లో ఐదు అత్యత్తమ ఇన్నింగ్స్‌లు మీకోసం...

 149 vs West Indies, Johannesburg, 2015

149 vs West Indies, Johannesburg, 2015

జనవరి 18న వెస్టిండిస్‌పై జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన డివిలియర్స్ తన పేరిట అరుదైన రికార్డుని నమోదు చేశాడు. 31 బంతుల్లో డివిలియర్స్ సెంచరీ నమోదు చేసి అప్పటివరకు ఉన్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కోరీ ఆండర్సన్ రికార్డుని చెరిపేశాడు. ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ మొత్తం 44 బంతులను ఎదుర్కొని 16 సిక్సులు సాయంతో 149 పరుగులు చేశాడు. 59 నిమిషాల పాటు క్రీజులో ఉన్నాడు.

 106 vs Australia, Perth, 2008

106 vs Australia, Perth, 2008

డివిలియర్స్ టెస్టు కెరీర్‌లో ఈ సెంచరీకి ఎంతో ప్రత్యేకత ఉంది. పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరిగిన ఈ టెస్టులో దక్షిణాఫ్రికా విజయానికి 414 పరుగులు అవసరం. గ్రేమ్ స్మిత్(108), హషీమ్ ఆమ్లా(53) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరడంతో సఫారీ జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ 106 పరుగులు నమోదు చేసి దక్షిణాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల చేజింగ్ చేసిన జట్టుగా దక్షిణాఫ్రికాను నిలిపాడు.

 33 vs Australia, Adelaide, 2008

33 vs Australia, Adelaide, 2008

2008లో డివిలియర్స్‌ పేరు అంతర్జాతీయ క్రికెట్‌లో మారుమోగిపోయింది. అడిలైడ్ వేదికగా జరిగిన ఈ టెస్టులో 430 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆఖరి రోజున 77/4తో దక్షిణాప్రికా చేధనకు దిగింది. నాలుగు గంటల పాటు క్రీజులో నిలిచిన డివిలియర్స్ స్ట్రైక్ రేట్ 15గా ఉంది. మ్యాచ్ డ్రా లక్ష్యంగా చివరిరోజున క్రీజులోకి దిగిన సఫారీ బ్యాట్స్‌మెన్లు ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ మ్యాచ్‌లో డివిలియర్స్‌కు తోడు డుప్లెసిస్ సుమారు ఏడు గంటల పాటు క్రీజులో నిలిచి సెంచరీ సాధించాడు. డుప్లెసిస్ సెంచరీతో దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ 33 పరుగులు చేశాడు. డివిలియర్స్ కెరీర్‌లో ఇదొక అత్యుత్తమ ఇన్నింగ్స్.

 217 vs India, Ahmedabad, 2008

217 vs India, Ahmedabad, 2008

అంతకముందు చెన్నై వేదికగా సఫారీలతో జరిగిన తొలి టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్ తన రెండో ట్రిపుల్ సెంచరీని నమోదు చేయడంతో డ్రాగా ముగిసింది. దీంతో అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తన ఆధిపత్యాన్ని కనబర్చింది. ఈ టెస్టులో సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 76 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో జాక్వస్ కల్లిస్‌ సెంచరీ చేయగా... ఏబీ డివిలియర్స్‌ డబుల్ సెంచరీలు నమోదు చేశాడు. తద్వారా భారత గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా డివిలియర్స్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

69 vs England, Chittagong, 2014

69 vs England, Chittagong, 2014

చిట్టగాంగా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు శుభారంభం ఇచ్చినప్పటికీ, దక్షిణాఫ్రికా 16 ఓవర్లు ముగిసే సరికి 128/3తో ఉంది. డివిలియర్స్ క్రీజులోనే ఉన్నాడు. చివరి నాలుగు ఓవర్లలో డివిలియర్స్ ఒక్కసారిగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 196 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ 28 బంతుల్లో 69 పరుగులు నమోదు చేశాడు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Story first published: Thursday, May 24, 2018, 13:13 [IST]
Other articles published on May 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X