చేదువార్త: భారత్‌తో తొలి వన్డేకు ఫించ్ అనుమానమే!

Posted By:

హైదరాబాద్: భారత్‌తో ఐదు వన్డేల సిరిస్‌కు ముందే ఆస్ట్రేలియా అభిమానులకు చేదు వార్త. గురువారం చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆసీస్ ఆటగాడు ఆరోన్ ఫించ్ గాయపడ్డాడు. దీంతో తొలి వన్డేలో అతడు ఆడటంపై అనుమానంగా మారింది.

బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో అతని కాలి పిక్కకు గాయమైందని ఆసీస్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. నెట్‌ ప్రాక్టీస్‌ సమయంలో తను గాయపడటంతో సెషన్‌కు దూరంగా ఉంచి విశ్రాంతి కల్పించారు. దీంతో అతడు సెప్టెంబర్ 17న చెన్నై వేదికగా జరిగే తొలి వన్డేలో ఆడటంపై సందిగ్దత నెలకొంది.

Finch doubtful for Australia opener

తొలి వన్డేకు ఆరోన్ ఫించ్ అందుబాటులో లేకపోతే అతని స్ధానంలో ట్రావిస్ హెడ్ లేదా హిల్టన్ కార్ట్‌రైట్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది. కాగా, బ్యాటింగ్ లైనప్‌లో నాలుగో స్థానానికి ట్రావిస్ హెడ్ సరిగ్గా సరిపోతాడని ఆసీస్ కోచ్ డేవిడ్ సాకేర్ చెప్పారు. దీంతో ఫించ్ స్ధానంలో హెడ్‌కు చోటు దక్కనుంది.

మరోవైపు తొలి వన్డే కోసం జట్టులోని మిగతా ఆటగాళ్లు నెట్స్‌లో బాగా చెమటోడ్చారు. ముందుగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన స్మిత్ ఆ తర్వాత మ్యాక్స్‌వెల్, వార్నర్, స్టోయినిస్, హెడ్‌లతో కలిసి క్యాచ్‌లను ప్రాక్టీస్ చేశాడు. మిగతా వారు కూడా అతడిని అనుసరించారు.

Story first published: Friday, September 15, 2017, 11:10 [IST]
Other articles published on Sep 15, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి