న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీ.. కోహ్లీలను కూడా ఇలానే చేస్తే బీసీసీఐ ఒప్పుకుంటుందా..?'

Feel sorry for Mithali Raj, you cannot drop someone like her: Sunil Gavaskar

న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెట్‌లో కొద్ది రోజులుగా చెలరేగుతున్న వివాదంలో మాజీలు సైతం గొంతుకలుపుతున్నారు. మిథాలీ రాజ్‌పైన సానుభూతి కురిపిస్తూ మద్ధతు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తాజా వివాదం విషయంలో మిథాలీ రాజ్‌కు క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ మద్దతు పలికారు. మిథాలీని చూస్తే తనకు బాధేస్తోందని ఆయన అన్నారు. మిథాలీ పరిస్థితిని టీమిండియా పురుషుల జట్టులోని క్రీడాకారులతో పోల్చి చూడమని సూచిస్తున్నారు.

 మ్యాచ్‌కు ఫిట్‌గా ఉన్నా ఎందుకు ఇలా

మ్యాచ్‌కు ఫిట్‌గా ఉన్నా ఎందుకు ఇలా

‘మిథాలీ అడిగిన ప్రశ్న సరైందే. తాను 20 ఏళ్లు దేశం తరఫున ఆడి పరుగులు సాధించింది. 2 సార్లు కూడా ఆమెనే 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచింది. గాయంతో ఒక మ్యాచ్‌ ఆడలేదు. తర్వాతి మ్యాచ్‌కు ఫిట్‌గా ఉన్నా ఎందుకు తీసుకోలేదు? నాకౌట్‌ల కోసం మీ అత్యుత్తమ ప్లేయర్‌ను కచ్చితంగా ఎంచుకోవాలి. మిథాలీ అనుభవం జట్టుకు ఎంతగానో పనికొచ్చేది. దీనినే పురుషుల క్రికెట్‌కు అన్వయించి చూస్తే వేరేలా ఉంటుంది.

కోహ్లీ.. ఒక మ్యాచ్‌ తర్వాత తిరిగిస్తే

కోహ్లీ.. ఒక మ్యాచ్‌ తర్వాత తిరిగిస్తే

విరాట్‌ కోహ్లి గాయంతో ఒక మ్యాచ్‌ ఆడకుండా ఆ తర్వాత తిరిగొస్తే అతడిని కూడా పక్కన పెడతారా? అని సునీల్‌ గవాస్కర్‌ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పొవార్‌ పాత్రపై బయటి వ్యక్తిగా తానేమీ చెప్పలేనన్న సన్నీ... అదే జట్టును కొనసాగించాలనుకున్నామని చెప్పడం ఏమాత్రం సహేతుక కారణం కాదని, మిథాలీ స్థాయి ప్లేయర్‌ను ఎలా తప్పిస్తారని వ్యాఖ్యానించారు.

మిథాలీ మెయిల్ ఎలా లీక్ అయిందో? ప్రశ్నించిన అమితాబ్

వేటు వేయడం దారుణమైన చర్య

వేటు వేయడం దారుణమైన చర్య

గవాస్కర్‌తో పాటు మంజ్రేకర్, ఫారూఖ్ ఇంజనీర్ వంటి ప్రముఖులు సైతం మద్ధతు తెలిపారు. ధోనీ, విరాట్‌ కోహ్లీలాంటి వాళ్లను ఇలా అవమానించే సాహసం బీసీసీఐ చేయగలదా అంటూ టీమిండియా మాజీ మహిళా క్రికెటర్‌ శాంతా రంగస్వామి ప్రశ్నించారు. మిథాలీ విషయంలో ఇలా జరగడం బాధిస్తోందని కామెంటేటర్‌, మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. మిథాలీపై వేటు వేయడం దారుణమైన చర్య. ఎంతో అనుభవమున్న ఓ క్రికెటర్‌పట్ల ఇలా వ్యవహరించడం సబబు కాదు' అని ఫరూఖ్‌ ఇంజనీర్‌ అన్నాడు.

Story first published: Thursday, November 29, 2018, 12:20 [IST]
Other articles published on Nov 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X