For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్యా ‘కరోనా’టీ20 ప్రపంచకప్ డౌటే.. 29న భవితవ్యం!!

Fate of T20 World Cup may be mulled at ICC meeting via tele-conference on March 29

మెల్‌బోర్న్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆటలన్నీ ఆగమాగమయ్యాయి. ఈ మహమ్మారి దెబ్బకు టోక్యో ఒలింపిక్సే వాయిదా వేయాల్సిన పరిస్థితి రాగా.. ఐపీఎల్ పూర్తిగా రద్దయ్యేలా ఉంది.
తాజాగా ఈ జాబితాలోకి ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ కూడా చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 29న ఈ టోర్నీ నిర్వాహణపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

వాస్తవానికి ఈ టోర్నీని అక్టోబర్ 18 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ ఆసీస్‌లో విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే రెండు వేల మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. దీంతో ఆ దేశం ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్ ప్రకటించింది.

ఇందులో భాగంగా తమ దేశ సరిహద్దులను మూసివేసిన ఆసీస్‌ మరో ఆరు నెలల పాటు దీన్ని కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే టోర్నీ నిర్వహణ కష్టం అవుతోంది. ఈ విషయాన్ని చర్చించడం కోసం సభ్య దేశాలతో పాటు అనుబంధ దేశాలతో ఐసీసీ 29న టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ భేటీలో బీసీసీఐ తరపున కార్యదర్శి జై షా లేదా అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పాల్గొనే అవకాశం ఉంది.

ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడైన షానే ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. ఇక చైనాలో పుట్టిన ఈ ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచమంతా పాకింది. మూడు లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. సుమారు 16 వేల మందికి పైగా మరణించారు.

Story first published: Tuesday, March 24, 2020, 16:00 [IST]
Other articles published on Mar 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+