న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Team India: నలుగురు టీమిండియా ప్లేయర్ల బర్త్ డే.. హీటెక్కుతున్న సోషల్ మీడియా

Fans pour wishes as four team india players celebrate birthdays

ఒకరిద్దరు స్టార్లు ఒకే రోజు బర్త్ డే జరుపుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే ఒకేసారి నలుగురు స్టార్ల పుట్టిన రోజులు రావడం.. వాళ్లు నలుగురూ టీమిండియాకే ఆడుతుండటం అరుదు. డిసెంబరు 6 అంటే మంగళవారం అదే జరిగింది. ఈ రోజున టీమిండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, బెస్ట్ వన్డే బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్, టెస్టు స్పెషలిస్టు కరుణ్ నాయర్ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. దీంతో నెటిజన్లు తమ సంతోషాన్ని అణుచుకోలేకపోతున్నారు.

పేస్ బౌలింగ్ డైమండ్..

టీమిండియా పేస్ బౌలింగ్ యూనిట్‌లో జస్‌ప్రీత్ బుమ్రా స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అతను కూడా డిసెంబర్ 6న బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. 29వ పడిలో అడుగు పెట్టిన ఈ పేస్ గుర్రాన్ని.. 'భారత పేస్ డైమండ్' అంటూ నెటిజన్లు కీర్తిస్తున్నారు. కాగా, గాయం కారణంగా అతను కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. బుమ్రా లేకుండా ఆడిన ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ రెండింట్లో టీమిండియా బౌలింగ్ తేలిపోయిన సంగతి తెలిసిందే.

బెస్ట్ ఆల్‌రౌండర్

ప్రస్తుత క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్ అనగానే గుర్తొచ్చే పేరు రవీంద్ర జడేజా. నేటితో 34వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఈ టీమిండియా ఆల్‌రౌండర్‌పై అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ఆసియా కప్‌ మధ్యలో మోకాలి గాయంతో జట్టుకు దూరమైన జడ్డూ కూడా టీ20 వరల్డ్ కప్‌లో ఆడలేదు. ఆ టోర్నీలో టీమిండియా మిస్ ఫీల్డ్ చేసిన ప్రతిసారీ అభిమానులు జడేజాను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం భార్య తరఫున గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ బిజీగా గడిపేస్తున్నాడు జడ్డూ.

వన్డేల్లో బెస్ట్..

నిదానంగా టీమిండియా వన్డే జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్న ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్. టీమిండియాలో నాలుగో నెంబర్ స్థానంపై కర్చీఫ్ వేసిన ఈ ముంబై ప్లేయర్ 28వ బర్త్ డే జరుపుకుంటున్నాడు. దీంతో అతనిపై కూడా అభిమానాన్ని చాటుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. తాజాగా న్యూజిల్యాండ్ పర్యటనలో కూడా అద్భుతంగా ఆడిన అయ్యర్.. బంగ్లాతో తొలి వన్డేలో ఫర్వాలేదనిపించాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత అద్భుతంగా రాణిస్తున్న ఇతన్ని వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

టెస్టు స్పెషలిస్టు

టెస్టు స్పెషలిస్టు

భారత టెస్టు జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్న కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్. భారత్ తరఫున ఆడింది కొన్ని మ్యాచులే అయినా.. మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడీ రైట్ హ్యాండర్ బ్యాటర్. అతను 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 303 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా కరుణ్ నాయర్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం రహానే, పుజారాలు రిటైర్‌మెంట్‌కు దగ్గర పడుతున్న నేపథ్యంలో కరుణ్ నాయర్ వచ్చే ఏడాదిలో అయినా భారత జట్టులో చోటు సంపాదించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Story first published: Tuesday, December 6, 2022, 12:42 [IST]
Other articles published on Dec 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X