న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!

 Fans not happy with Chris Gayle after shocking comments on RCB and PBKS

క్రికెట్ చూసే ప్రతి వ్యక్తికీ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ తెలుసు. ఐపీఎల్‌లో కూడా అతను చాలా రికార్డులు తిరగరాశాడు. ముఖ్యంగా అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడినప్పుడు గేల్ పాపులారిటీ మరో స్థాయికి చేరింది. కోహ్లీ, గేల్, డివిల్లీర్స్ త్రయం ఆ జట్టుకు ఒక సింబల్‌గా మారింది. ఇంత పాపులారిటీ తెచ్చిపెట్టిన ఫ్రాంచైజీపై గేల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు, తన మరో మాజీ జట్టు పంజాబ్ కింగ్స్‌పై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు.

తాజాగా ఒక ఛానెల్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పతో గేల్ ముచ్చటించాడు. ఈ క్రమంలో ఊతప్ప మాట్లాడుతూ.. ఆర్సీబీ అంటే కేవలం విరాట్, ఏబీ డివిల్లీర్స్ అనే అనుకుంటారు కదా అన్నాడు. దీనిపై స్పందించిన గేల్ దానికి అవుననే సమాధానమే ఇచ్చాడు. 'ఆర్సీబీ, పంజాబ్ జట్లు ఈ విషయంలో చాలా నేర్చుకోవాలి. ఆటగాళ్లను నమ్మడం, లాయల్‌గా ఉండటం గురించి అర్థం చేసుకోవాలి. ఆర్సీబీలో ఉన్న ఆటగాళ్లు తాము ఆ ఫ్రాంచైజీలో భాగం అని అనుకోరు' అని చెప్పాడు.

ఈ వ్యాఖ్యలు ఆయా జట్ల ఫ్యాన్స్‌కు ఏమాత్రం రుచించలేదు. ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా షాకయ్యారు. ఆ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోయినా కూడా.. అభిమానులు ఆ ఫ్రాంచైజీని ఎంతో నమ్మకంగా ఫాలో అవుతున్నారు. ఆటగాళ్లకు కూడా అంతే. వాళ్లు కూడా ఒక ఫ్యామిలీగా కలిసిపోయి ఉంటారు.

విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లీర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్ తదితర ఆటగాళ్లంతా ఈ ఫ్రాంచైజీకి ఆడిన వాళ్లే. వీళ్లందరూ చాలా క్లోజ్‌గా ఉంటారు కూడా. ఈ క్రమంలోనే గేల్‌పై మండిపడిన అభిమానులు.. ఇదంతా చెత్త వాగుడు అంటూ తిట్టిపోస్తున్నారు. అతని నుంచి ఇలాంటివి ఆశించలేదని అంటున్నారు. అయితే పంజాబ్ జట్టుకు మాత్రం ఈ సమస్య ఉందని పలువురు ఆటగాళ్లు గతంలో కూడా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, January 28, 2023, 14:25 [IST]
Other articles published on Jan 28, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X