న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs SRH: అర్జున్ టెండూల్కర్ ఇంత పనికిరానివాడా? రోహిత్ శర్మపై సచిన్ ఫ్యాన్స్ ఫైర్!

Fans Disappointed After MI Didn’t Pick Arjun Tendulkar in the Playing XI Against SRH

ముంబై: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మపై దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ పాయింట్స్ టేబుల్‌లో చిట్టచివరి స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లు గెలిచినా తమకు ఒరిగేదేం లేదని భావించిన ముంబై మేనేజ్‌మెంట్ టీమ్ బెంచ్‌ను పరీక్షించే పనిలో పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో గత మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్ వంటి సీనియర్ ఆటగాడిని పక్కన పెట్టి యువప్లేయర్లకు అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం దక్కుతుందని ఫ్యాన్స్ భావించారు.

అర్జున్‌కు తీరని అన్యాయం..

కానీ ముంబై మేనేజ్‌మెంట్ మాత్రం ఇద్దరు రెగ్యూలర్ స్పిన్నర్లను పక్కనపెట్టి బెంచ్‌పై కూర్చున్న మయాంక్ మార్కండే, సంజయ్ యాదవ్‌లకు అవకాశం కల్పించింది. దాంతో అర్జున్ అరంగేట్రం ఊహించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. దాంతో ముంబై సారథి రోహిత్ శర్మపై ఫ్యాన్స్ తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. జట్టులో ప్రతీ ఒక్కరికి అవకాశం ఇస్తున్న ముంబై మేనేజ్‌మెంట్.. అర్జున్ టెండూల్కర్‌ను పట్టించుకోకపోవడం దారుణమని కామెంట్ చేస్తున్నారు. అర్జున్ టెండూల్కర్ ఇంత పనికిరానివాడా? అని మండిపడుతున్నారు. ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది.

సచిన్ కుమారుడికి కనీస గౌరవం లేదు..

'అర్జున్ టెండూల్కర్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే అతని అరంగేట్రం కోసం ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్లుగా జట్టుతో ఉన్న అతనికి అవకాశం ఇవ్వకపోవడం దారుణమని మరికొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్‌కు కనీస గౌరవం కూడా ముంబై ఇండియన్స్ ఇవ్వడం లేదని, అర్జున్ టెండూల్కర్‌ను ట్రీట్ చేస్తున్న విధానం నచ్చడం లేదని మండిపడుతున్నారు. ముంబై కాకుండా మరే ఏ జట్టుకు ఆడినా అర్జున్‌కు రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కేదని కామెంట్ చేస్తున్నారు. ముంబై సెలెక్టర్లకు బుద్దిలేదని కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

చివరి మ్యాచ్‌లో చాన్స్..

ఇక లీగ్‌లో మిగిలిన చివరి మ్యాచ్‌లో కూడా యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తామని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఈ లెక్కన అర్జున్ టెండూల్కర్‌కు ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో చోటు దక్కడం ఖాయమని తెలుస్తోంది. అయితే రోహిత్ శర్మ వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైరికల్‌గా స్పందిస్తున్నారు. చివరి మ్యాచ్‌లో రోహిత్ తన స్థానాన్ని అర్జున్ టెండూల్కర్ కోసం త్యాగం చేస్తాడని, తిలక్ వర్మ సారథిగా జట్టును నడిపిస్తాడని వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

Story first published: Tuesday, May 17, 2022, 20:50 [IST]
Other articles published on May 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X