న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆశ్విన్ బీటెక్.. ధోనీ డిగ్రీ.. కోహ్లీ, రోహిత్ ఏం చదివారో తెలుసా!

Famous Indian cricketers Virat kohli, Rohit Sharma and their educational qualifications

హైదరాబాద్: ఈ రోజుల్లో చదువుకున్న ప్రాధాన్యత ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాయ కష్టం చేసైనా సరే తమ పిల్లలకు మంచి చదువును అందించాలని ప్రతీ తల్లిదండ్రులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజుల్లో మనిషికి చదువు ఓ ప్రామాణికం అయిపోయింది. ఎక్కడికెళ్లినా.. ఎవరైనా తొలుత అడిగేది ఏం చదువుకున్నావని? అయితే చాలా మందికి టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఏం చదువుకున్నారనే విషయం పెద్దగా తెలియదు. తమదైన ఆటతో కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్న భారత ఆటగాళ్లలో కొంతమంది అత్యున్నతమైన చదువులు చదివితే.. మరికొంతమంది మాత్రం తమకు ఇష్టమైన ఆట కోసం సాధారణ విద్యకే పరిమితమయ్యారు. ఓసారి భారత ఆటగాళ్ల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్‌పై లుక్కెద్దాం.

ధోనీ బీకామ్..

ధోనీ బీకామ్..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డిగ్రీ వరకు చదువుకున్నాడు. వరల్డ్ క్రికెట్‌లో బెస్ట్ కెప్టెన్, వికెట్ కీపర్, ఫినిషర్‌గా గుర్తింపు పొందిన ధోనీ బీకామ్ డిగ్రీ పట్టా పొందాడు. అతని అరంగేట్రం ఆలస్యం కావడంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగలడు. స్పోర్ట్స్ కోటాలో రైల్వే కలెక్టర్‌గా ఉద్యోగం సాధించిన ధోనీ.. కొన్నాళ్లు ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాల వయస్సులోనే అంతర్జాతీయంగా అడుగుపెట్టాడు. దాంతో అతను 12 వ తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగాడు.

ద్రవిడ్ ఎంబీఏ..

ద్రవిడ్ ఎంబీఏ..

భారత్ గెలిచిన రెండు ప్రపంచకప్‌ల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ఆల్‌రౌండర్ యువ రాజ్ సింగ్ కూడా 12వ తరగతి వరకే చదువుకున్నాడు. టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్ మాత్రం ఎంబీఏ చేశాడు. భారత క్రికెట్ చరిత్రలోనే హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగిన ఆటగాడు రాహుల్ ద్రవిడే. అతను బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలీజే ఎంబీఏ పూర్తి చేశాడు. ఇక దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. మాజీ పేసర్ జహీర్ ఖాన్ 12వ తరగితి వరకే చదవగా.. లక్ష్మణ్ ఎంబీబీఎస్‌ను డిస్ కంటీన్యూ చేశాడు. క్రికెట్‌పై ఫోకస్ పెట్టేందుకు మధ్యలోనే వదిలేశాడు. సెహ్వాగ్, గంభీర్ డిగ్రీ పూర్తి చేయగా.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా డిగ్రీ చదివాడు.

రోహిత్, కోహ్లీ..12వ తరగతే..

రోహిత్, కోహ్లీ..12వ తరగతే..

ఈ తరం ఆటగాళ్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 12 వ తరగతి వరకు చదువుకున్నాడు. అతను 2008 లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. కోహ్లీ భారత్‌లోనే కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్ మాన్. ఢిల్లీలోని విశాల్ భారతి పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను అభ్యసించాడు. హిట్‌మన్‌ రోహిత్ శర్మ పరిమిత ఓవర్లలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్. రోహిత్.. స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ పాఠశాల విద్యను పూర్తి చేయగా.. రిజ్వి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కళశాలలో చదుకున్నారు. రోహిత్ కూడా 12 వ వరకు చదివాడు. 2007 లో భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు.

అశ్విన్ బీటెక్ ఇన్ ఐటీ..

అశ్విన్ బీటెక్ ఇన్ ఐటీ..

భారత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె జట్టులోని సౌమ్యుడైన ఆటగాళ్ళలో ఒకడు. ఎస్వీ జోషి హై స్కూల్ పాఠశాల.. రిజ్వి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ లో చదువుకున్నాడు. రహానే 2011 లో టీమ్ ఇండియా తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. భారత్‌లో అత్యంత విజయవంతమైన స్పిన్నర్లలో ఒకరైన అశ్విన్ ఉన్నత చదువులు చదివాడు. చెన్నైలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బిటెక్ డిగ్రీ పొందారు.

Story first published: Friday, June 11, 2021, 20:46 [IST]
Other articles published on Jun 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X