న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ కలిసి రావట్లేదని కెప్టెన్ కాయిన్‌ను..

Faf Du Plessis Introduces The 'Specialist Coin-Tosser'
Faf du Plessis introduces the specialist coin-tosser

న్యూ ఢిల్లీ: క్రికెట్‌లో టాస్ అనేది చాలా ముఖ్యం. టాస్ ఫలితం మ్యాచ్ ఫలితాలను తారుమారు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌కు ఎంతకూ అదృష్టం కలిసి రావట్లేదు. దీంతో క్రికెట్ చరిత్రలో తొలిసారి సౌతాఫ్రికా కెప్టెన్ పాప్ డుప్లెసిస్.. ప్రత్యేకంగా కాయిన్ గాల్లోకి వేయడానికి మరో ప్లేయర్‌ను వెంట తీసుకొచ్చాడు.

ధావన్‌కు కొత్త పేరు పెట్టిన హర్భజన్ధావన్‌కు కొత్త పేరు పెట్టిన హర్భజన్

డుప్లెసిస్‌ చిత్రమైన ఆలోచన చేశాడు

డుప్లెసిస్‌ చిత్రమైన ఆలోచన చేశాడు

ఆ ప్లేయర్ ఎవరో కాదు జట్టు సహచరుడు జేపీ డుమిని. దీంతో అతడు ఓ చిత్రమైన ఆలోచన చేశాడు.ఈసారి అదృష్టాన్ని నమ్ముకొని డుమినిని తీసుకొచ్చాడు. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 మ్యాచ్ కోసం డుప్లెసిస్ ఈ ప్రయోగం చేశాడు. ఇది వర్కవుట్ అయింది. డుమిని వేసిన టాస్ సౌతాఫ్రికాకు అనుకూలంగా వచ్చింది.

సౌతాఫ్రికా తుది జట్టులోనే లేని డుమిని

సౌతాఫ్రికా తుది జట్టులోనే లేని డుమిని

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే డుమిని అసలు సౌతాఫ్రికా తుది జట్టులోనే లేకపోవడం విశేషం. డుమిని స్పెషలిస్ట్ కాయిన్ టాస్ అంటూ ఈ వీడియోను డుప్లెస్సీయే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ రిఫరీ సమక్షంలో ఫీల్డ్‌లోనే టాస్ వేయాలి.

ఫలించిన ఎత్తుగడ

ఫలించిన ఎత్తుగడ

కెప్టెన్ అందుబాటులో లేకపోతేనే మరో వ్యక్తి అతని స్థానంలో టాస్ వేసే అవకాశం కల్పిస్తారు. నాణేన్ని ఎగరేసే బాధ్యతను తుది జట్టులో కూడా లేని డుమినికి అప్పగించాడు. ఈ ఎత్తుగడ ఫలించింది. డుప్లెసిస్‌ నుంచి నాణేన్ని తీసుకొని డుమిని గాల్లో ఎగరేయగా ఫలితం అనుకూలంగా వచ్చింది.

టాస్‌ నాణేన్ని మరొకరికి ఇవ్వొద్దని

టాస్‌ నాణేన్ని మరొకరికి ఇవ్వొద్దని

జింబాబ్వేతో తొలి టీ20 సందర్భంగా ఇది జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 34 పరుగుల తేడాతో గెలిచింది. కెప్టెన్‌ టాస్‌ నాణేన్ని మరొకరికి ఇవ్వొద్దని ఐసీసీ నిబంధనల్లో ఎక్కడా లేదు. ఈ సిరీస్‌లో రెండో టీ20లోనూ నెగ్గి దక్షిణాఫ్రికా సిరీస్‌ను గెలుచుకుంది.వర్షం వల్ల చివరిదైన మూడో టీ20 రద్దయింది.

Story first published: Monday, October 15, 2018, 10:41 [IST]
Other articles published on Oct 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X