న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీనే మన టార్గెట్.. బంతుల్ని చూసి విసరండి'

'Virat Kohli Should Be Your Target' Says Michael vaughan
Ex-England captain Michael Vaughan reveals how hosts can stop Indias Virat Kohli in upcoming Test series

హైదరాబాద్: మరో కొద్ది గంటల్లో ఎందరో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఇంగ్లాండ్-ఇండియా టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు మొత్తం కోహ్లీనే టార్గెట్‌గా ఆడాలని పలువురు సూచనలిస్తున్నారు. ప్రస్తుతమున్న బ్యాట్స్‌మెన్‌లో అనుభవం రీత్యా.. ప్రతిభానుగుణంగా కోహ్లీనే బాగా రాణించగలడని అతణ్ని కట్టడి చేస్తే పరుగులను అదుపు చేయవచ్చని భావిస్తున్నారు.

1
42374
విరాట్‌ కోహ్లీని సవాల్‌ చేయండి

విరాట్‌ కోహ్లీని సవాల్‌ చేయండి

ఈ క్రమంలోనే ‘కసిగా ఉండండి, విరాట్‌ కోహ్లీని సవాల్‌ చేయండి' అని మాజీ కెప్టెన్ మైకేల్‌ వాన్‌ ఇంగ్లాండ్‌ జట్టుకు సూచనలిస్తున్నాడు. అత్యుత్తమ పర్యాటక జట్టు అనిపించుకోవాలన్న తపనతో పర్యటిస్తున్న భారత్‌కు కఠిన సవాళ్లు విసరాలన్నాడు. అలిస్టర్‌ కుక్‌ నిలకడగా ఆడాలని, కెప్టెన్ జో రూట్‌ తన ఇన్నింగ్స్‌లను గుర్తుండిపోయేలా బ్యాటింగ్‌ చేయాలన్నాడు.

జో రూట్‌.. బృందంలో కసి నింపాలి

జో రూట్‌.. బృందంలో కసి నింపాలి

స్టువర్ట్‌ బ్రాడ్‌, అండర్సన్‌ రంగంలోకి దిగి విరాట్‌ కోహ్లీని అడ్డుకోవాలని పేర్కొన్నాడు. ‘జో రూట్‌ తన బృందంతో మాట్లాడి వారిలో కసి నింపాలి. అవసరమైతే ఒక్కొక్క ఆటగాడితో వ్యక్తిగతంగా మాట్లాడాలి. అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్..‌ కోహ్లీ కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించాలి. అతడు ఫ్రంట్‌ ఫుట్‌ ఆడకుండా సవాల్‌ చేయాలి. బంతుల్ని ఔట్‌సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ వైపు విసరాలి.

బంతి దూరంగా పోతుందా లేదా అని సందేహపడేలా

బంతి దూరంగా పోతుందా లేదా అని సందేహపడేలా

మధ్యలో ఒకటో రెండు బంతుల్ని నేరుగా వికెట్ల వైపు విసిరి కోహ్లీ బంతి దూరంగా పోతుందా లేదా అని సందేహపడేలా చేయాలి. కోహ్లీ ఫ్రంట్‌ ఫుట్‌ ఆడతాడనుకున్నప్పుడు ఆఫ్‌సైడ్‌ పడేలా బంతులు విసిరితే వాటిని ఆడే క్రమంలో ఎడ్జ్‌ అయి స్లిప్‌లో దొరుకుతాడు' అని వాన్‌ ఇంగ్లాండ్‌కు సూచనలిచ్చాడు.

 ఇదొక అద్భుతమైన సిరీస్‌.

ఇదొక అద్భుతమైన సిరీస్‌.

‘ఇదొక అద్భుతమైన సిరీస్‌. పిచ్‌లు చాలా బాగున్నాయి. ఇంగ్లాండ్‌ ఆరుగురు బౌలర్లతో ఆడొద్దు. ఐదుగురు ఉంటే సరిపోతుంది. రూట్‌ పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా ఉండాలి. ఒక స్పిన్నర్‌ను ఎంచుకుంటే నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలి. కుక్‌ తన అనుభవాన్ని ఉపయోగించి నిలకడైన ఇన్నింగ్స్‌లు ఆడాలి. వన్డే సిరీస్‌లో వరుస శతకాలు చేసిన రూట్‌ తన ఫామ్, లయ అందుకున్నాడు. గెలవాలనే వైఖరితో పోరాడాలి' అని వాన్‌ అన్నాడు.

Story first published: Tuesday, July 31, 2018, 9:36 [IST]
Other articles published on Jul 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X