న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్రాత్మక విజయం కోసం విండీస్‌.. ప్రతీకారం కోసం ఇంగ్లండ్‌.. ఆఖరి ఆటలో గెలిచేదెవరో?

England vs West Indies 3rd Test: Who will retain the Wisden Trophy

మాంచెస్టర్‌: కరోనా కష్టాలను పక్కనబెడుతూ..అత్యద్భుతంగా అంతర్జాతీయ క్రికెట్‌ను పున:ప్రారంభించిన ఇంగ్లండ్, వెస్టిండీస్.. ఆఖరాటలో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యాయి. చెరో గెలపుతో మంచి జోష్ మీదున్న ఇరుజట్లు.. ఇప్పుడు సిరీస్‌పై కన్నేసాయి. చరిత్రాత్మక విజయాన్నందుకోవాలని విండీస్ ఉవ్విళ్లూరుతుంటే.. ప్రతీకారం కోసం ఇంగ్లండ్ రగిలిపోతుంది. అయితే రెండు జట్ల బలం, బలగం సమానంగానే కనిపిస్తున్నా.. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సూపర్ పెర్ఫామెన్స్.. ఆతిథ్య జట్టుకు కొండంత అండగా మారింది. కానీ తొలి టెస్ట్‌లో విజృంభించిన కరీబియన్ కెప్టెన్ జాసన్ హోల్డర్, షెనన్ గాబ్రియేల్ మరోసారి మెరిస్తే ఇంగ్లీష్ టీమ్‌కు కష్టాలు తప్పేలా లేవు. ఓవరాల్‌గా గత రెండు మ్యాచ్‌ల ఫలితాలను పట్టించుకోకుండా ఫ్రెష్‌గా బరిలోకి దిగాలని భావిస్తున్న ఇరు జట్లలో విజ్డెన్ ట్రోఫీని అందుకునేదెవరో..!

స్టోక్స్ జోరు.. ఇంగ్లండ్ హుషారు..

స్టోక్స్ జోరు.. ఇంగ్లండ్ హుషారు..

ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ జోరుతో ఆతిథ్య జట్టు ట్రాక్‌లో పడింది. రెండో టెస్టులో భారీ శతకంతో పాటు మెరుపు అర్ధసెంచరీ ఇంగ్లండ్‌ను రేసులో నిలిపింది. ఓపెనర్‌ సిబ్లీ కూడా సెంచరీతో ఫామ్‌లోకి రావడం... ఈ ఆఖరి మ్యాచ్‌ కూడా మాంచెస్టర్‌లోనే జరగడం కలిసొచ్చే అంశం. బట్లర్‌ కూడా మెరుగ్గానే రాణించాడు. టాపార్డర్, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ టచ్‌లోకి రావడంతో బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. అలాగని బౌలింగ్‌ దళం లోటుపాట్లతో ఏమీ లేదు.

ఆర్చర్‌తో అయోమయం

ఆర్చర్‌తో అయోమయం

రెండో టెస్టులో బుడగ దాటి క్రమశిక్షణ చర్యకు గురైన ఆర్చర్‌ ఇప్పుడు ఆఖరి పోరుకు అందుబాటులోకి రావడం ఇంగ్లండ్‌కు తుది జట్టు సెలక్షన్‌ తలనొప్పులు తెచ్చిపెట్టింది. గత మ్యాచ్‌లో యువ ఆల్‌రౌండర్‌ స్యామ్‌ కరన్‌తో పాటు బ్రాడ్, వోక్స్‌ చక్కగా రాణించారు. దీంతో ఎవరిని పక్కనబెట్టాలన్నది టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు సమస్యగా మారింది. పైగా ఈ మ్యాచ్‌లో అండర్సన్‌ను ఆడితే కరన్‌తో పాటు, వోక్స్‌నూ బెంచ్‌కే పరిమితం చేసే అవకాశముంటుంది.

తొలి టెస్టులో కనబరిచిన ఆల్‌రౌండ్‌ ప్రదర్శన రెండో

తొలి టెస్టులో కనబరిచిన ఆల్‌రౌండ్‌ ప్రదర్శన రెండో

టెస్టుకొచ్చే సరికి నీరుగారిపోయింది. ఓపెనర్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్, మిడిలార్డర్‌లో బ్లాక్‌వుడ్, రోస్టన్‌ చేజ్‌లు మాత్రం నిలకడగా ఆడుతున్నప్పటికీ మిగతావారిలో డౌరిచ్, బ్రూక్స్, షై హోప్‌ ఒక ఇన్నింగ్స్‌ ఆడితే మరో ఇన్నింగ్స్‌ విఫలమవుతున్నారు. కీలకమైన తరుణంలో బ్యాట్స్‌మెన్‌ బాధ్యతగా ఆడలేకపోవడం జట్టును కలవర పెడుతుంది. ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేసిన కరీబియన్‌ బౌలర్లు... గత మ్యాచ్‌లో మాత్రం ఆ మేరకు ప్రభావం చూపలేదు. సౌతాంప్టన్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ స్టోక్స్‌ను కట్టడి చేసిన విండీస్‌ కెప్టెన్‌ హోల్డర్‌ మాంచెస్టర్‌లో మాత్రం తేలిపోయాడు. గత మ్యాచ్‌ వైఫల్యాలను అధిగమిస్తే నిర్ణాయక పోరులో జట్టుకు కలిసొస్తుంది. లేదంటే సిరీస్‌నే ప్రత్యర్థి చేతిలో పెట్టాల్సివుంటుంది.

పిచ్‌, వాతావరణం

పిచ్‌, వాతావరణం

సిరీస్‌ నిర్ణాయక మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయి. తొలి రోజు వాతావరణం అనుకూలించినా ఆ తర్వాతి నాలుగు రోజులు మాత్రం వర్షం కారణంగా మ్యాచ్‌ సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బౌలర్లకు పిచ్‌ లాభించవచ్చు. అయితే, ఇక్కడ జరిగిన చివరి ఆరు టెస్టుల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టే నెగ్గింది.

జట్లు (అంచనా)

ఇంగ్లండ్‌: రోరీ బర్న్స్‌, డామ్‌ సిబ్లే, జాక్‌ క్రాలే, జో రూట్‌ (కెప్టెన్‌), బెన్‌ స్టోక్స్‌, ఒల్లీ పోప్‌, డామ్‌ బెస్‌, జోఫ్రా ఆర్చర్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ ఆండర్సన్‌.

విండీస్‌: క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, క్యాంప్‌బెల్‌, షాయ్‌ హోప్‌/ జోషువా డ సిల్వ, షమర బ్రూక్స్‌, రోస్టన్‌ చేజ్‌, జెర్మెయిన్‌ బ్లాక్‌వుడ్‌, షేన్‌ డౌరిచ్‌, జేసన్‌ హోల్డర్‌, అల్జెరి జోసెఫ్‌, కీమర్‌ రోచ్‌/రకీమ్‌ కార్న్‌వాల్‌, షానన్‌ గాబ్రియెల్‌.

Story first published: Friday, July 24, 2020, 12:49 [IST]
Other articles published on Jul 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X