న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England vs Pakistan: షాన్ మసూద్ హాఫ్ సెంచరీ.. బాబర్ ఆజామ్ ఔట్.. కష్టాల్లో పాక్!

England vs Pakistan 1st Test: Shan Masood, Shadab Khan take Pakistan to 187/5 at Lunch

మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌‌లో పాకిస్థాన్ కష్టాల్లో పడింది. వర్షం అంతరాయం కలిగించిన తొలి రోజు ఆటలో పర్వాలేదనిపించినా.. రెండో రోజు మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఆతిథ్య బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఫలితంగా లంచ్ బ్రేక్ సమయానికి పాక్ 75 ఓవర్లలో 5 వికెట్లకు 187 రన్స్ చేసింది. క్రీజులో ఓపెనర్ బ్యాట్స్‌మన్ (77 బ్యాటింగ్), షాదాబ్ ఖాన్(1 బ్యాటింగ్) ఉన్నారు.

అంతకు ముందు 139/2 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన పాక్.. తొలి ఓవర్‌లోనే బాబర్ ఆజామ్(69) వికెట్ కోల్పోయింది. బాబర్‌‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన అండర్సన్ ఇంగ్లండ్‌కు శుభారంభాన్నిచ్చాడు. అనంతరం అసద్ షఫీక్ క్రీజులోకి రాగా.. ఓపెనర్ షాన్ మసూద్ 156 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ జోడీ ఆచితూచి ఆడే ప్రయత్నం చేసినప్పటికీ.. బ్రాడ్ దెబ్బకొట్టాడు. అసద్(7)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ కూడా త్వరగానే ఔటయ్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దీంతో పాక్ 176 రన్స్‌కే 5 కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన షాదాబ్ ఖాన్‌తో మసూద్ ఆచితూచి ఆడాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.

Story first published: Thursday, August 6, 2020, 17:53 [IST]
Other articles published on Aug 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X