న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 సిరిస్: ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాలో భారీ మార్పులు

By Nageshwara Rao
Krunal Pandya, Deepak Chahar called up to India's T20I squad for England
England Vs India: Deepak Chahar, Krunal Pandya called up to Team India T20I squad

హైదరాబాద్: ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన కోహ్లీసేన ఇంగ్లాండ్‌తో జరిగే మూడు టీ20ల సిరిస్‌కు సిధ్దమవుతోంది. ప్రతిష్టాత్మక ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20కి ముందు వాషింగ్టన్ సుందర్, తొలి టీ20 మ్యాచ్‌లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డారు.

ఐర్లాండ్‌తో గత బుధవారం జరిగిన తొలి టీ20 సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా బుమ్రా గాయపడ్డాడు. బ్యాట్స్‌మెన్ బాదిన బంతిని రిటర్న్ క్యాచ్ అందుకోవడంలో అతడి వేలికి దెబ్బ తగిలింది. బీసీసీఐ వైద్య బృందం అతడి వేలిని స్కానింగ్ కూడా తీయించింది. దీంతో వీరిద్దరు ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ నుంచి దూరమయ్యారు. అయితే వీరిద్దరి స్థానాలను భర్తీ చేస్తూ బీసీసీఐ జట్టులో భారీ మార్పులు చేసింది.

టీ20 సిరీస్‌ కోసం వాషింగ్టన్ సుందర్ స్థానంలో కృనాల్ పాండ్యా, వన్డే సిరీస్ కోసం అతని స్థానంలో అక్సర్ పటేల్‌ని జట్టులోకి తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక, బుమ్రా స్థానంలో టీ20 సిరీస్ కోసం ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అద్భుత ప్రదర్శన చేసిన దీపక్ చాహర్‌ని జట్టులోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది.

బుమ్రా జట్టుకు దూరమవడం భారత అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక, ఐర్లాండ్ సిరీస్‌కి ముందు టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ సమయంలో సరదాగా ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా ఆ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. దీంతో అతను ఐర్లాండ్‌ సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్‌తో ఆడే టీ20, వన్డే సిరీస్‌లకు పూర్తిగా దూరమయ్యాడు.

వన్డే సిరీస్ ప్రారంభం అయ్యే సమయానికి బుమ్రా కోలుకుంటే అతను వన్డే సిరీస్‌లో పాల్గొనే అవకాశం ఉంది. జులై 3వ తేదీన భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టి20 మ్యాచ్ జరుగనుంది.

Story first published: Sunday, July 1, 2018, 17:37 [IST]
Other articles published on Jul 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X