న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్‌ 'ఢీ'.. ఒత్తిడిలో ఇంగ్లండ్‌

England vs Australia Match Prediction – Weather Report, Pitch Conditions, Playing XIs and Live Streaming Details

ప్రపంచకప్‌లో మరో హై వోల్టేజ్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మంగళవారం డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు తలపడనుంది. ఇంగ్లండ్‌పై గెలిచి సెమీస్‌ బెర్త్‌ను సొంతం చేసుకోవాలని ఆసీస్‌.. శ్రీలంక చేతిలో ఎదురైన అనూహ్య ఓటమిని మర్చిపోయి మళ్లీ విజయాల బాట పట్టాలని ఇంగ్లండ్‌ భావిస్తున్నాయి. శ్రీలంకతో లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో ఓడడం మోర్గాన్‌ సేన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించిన ఇంగ్లండ్‌.. సెమీస్‌ చేరాలంటే మిగతా మ్యాచ్‌లు తప్పకుండా నెగ్గాలి.

 ఒత్తిడిలో ఇంగ్లండ్‌:

ఒత్తిడిలో ఇంగ్లండ్‌:

ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ గాయంతో దూరమవడం టీమ్‌ కష్టాలను రెట్టింపు చేసింది. రాయ్‌ స్థానంలో వచ్చిన జేమ్స్ విన్స్‌ గత రెండు మ్యాచ్‌లలోనూ రాణించలేదు. అయితే రాయ్‌ గాయం తగ్గిందని నిర్ధారణ అయింది. సోమవారం నెట్స్‌లో సాధన కూడా చేశాడు. ఈ మ్యాచ్‌లో రాయ్‌ బరిలోకి దిగితే ఇంగ్లండ్‌ ఓపెనింగ్‌ కష్టాలు తీరినట్టే. రూట్, కెప్టెన్ మోర్గాన్, బట్లర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. బెన్‌ స్టోక్స్‌, ఆలీ, వోక్స్ వంటి భారీ హిట్టర్లు ఉన్నారు. ఇక బౌలింగ్‌లో ఆర్చర్, వుడ్, వోక్స్ దుమ్మేరేపుతున్నారు. అయితే ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను ఏ మేరకు కట్టడి చేస్తారో చూడాలి.

సూపర్‌ ఫామ్‌లో ఆస్ట్రేలియా:

సూపర్‌ ఫామ్‌లో ఆస్ట్రేలియా:

భారత్‌ చేతిలో మాత్రమే ఓడిన ఆస్ట్రేలియా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. వరుస విజయాలతో కంగారులు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నారు. ఓపెనర్లు వార్నర్, ఫించ్‌లు సూపర్‌ ఫామ్‌లో ఉండడం.. స్మిత్, ఖవాజాలు నిలకడగా రాణిస్తుండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, క్యారీలు ఉండనే ఉన్నారు. మిచెల్‌ స్టార్క్‌, కమిన్స్, కూల్టర్‌ నైల్‌ వంటి టాప్ బౌలింగ్ దళం ఉంది. స్పిన్నర్‌ జంపా మాత్రం భారీగా పరుగులిస్తుండటం ఆసీస్‌ను ఇబ్బంది పెట్టే అంశం. అతని స్థానంలో నాథన్‌ లయన్‌కి చాన్స్‌ దొరికే అవకాశం ఉంది.

ముఖాముఖి రికార్డు:

ముఖాముఖి రికార్డు:

ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ఇప్పటివరకు 147 వన్డేలు ఆడాయి. ఆసీస్ 81 మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్ 61 మ్యాచ్‌ల్లో గెలిచింది. రెండు మ్యాచ్‌లు ‘టై'కాగా.. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ఏడుసార్లు తలపడ్డాయి. రెండుసార్లు ఇంగ్లండ్, ఐదుసార్లు ఆస్ట్రేలియా గెలిచాయి. లార్డ్స్‌లో మంగళవారం వేడి వాతావరణం ఉండనుంది. చిరుజల్లులు కురిసినా.. మ్యాచ్‌కు వర్షం ఆటంకం కాకపోవచ్చు. పిచ్‌ బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది.

జట్లు (అంచనా):

ఇంగ్లండ్‌: బెయిర్‌స్టో, విన్స్‌/జేసన్‌ రాయ్, జో రూట్, మోర్గాన్‌ (కెప్టెన్‌), బెన్‌ స్టోక్స్, బట్లర్, మొయిన్‌ అలీ, క్రిస్‌ వోక్స్, ఆదిల్‌ రషీద్, ఆర్చర్, వుడ్‌.

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్, ఖవాజా, స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, అలెక్స్‌ క్యారీ, కూల్టర్‌ నైల్, కమిన్స్, స్టార్క్, జంపా/నాథన్‌ లయన్‌.

Story first published: Tuesday, June 25, 2019, 12:34 [IST]
Other articles published on Jun 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X