న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాలకృష్ణ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని ఇంగ్లాండ్ కప్ గెలిచిందా?

England Took Balakrishna Comments Serious To Win World Cup 2019 || Oneindia Telugu
England took balakrishna comments serious to win world cup

హైదరాబాద్: ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ టాలీవుడ్ హీరో బాలకృష్ట చేసిన కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుందా? అంటే అవుననే అంటున్నారు ఆయన అభిమానులు. హీరో బాలకృష్ణ ఇంగ్లాండ్‌ను ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోయారని ప్రశ్నించడం వల్లే ఆ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని 2019 ప్రపంచకప్‌లో కప్ గెలిచి చూపిందంటూ ఓ వీడియోని వాట్సప్‌లో షేర్ చేసుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే...
2012లో బాలకృష్ట నటించిన అధినాయకుడు సినిమా విడుదలైంది. ఈ సినిమాలో బాలకృష్ణ మూడు పాత్రల్లో మెప్పించారు. ఈ సినియాలో తాత వేషంలో ఉన్న బాలకృష్ణ ఓ సన్నివేశంలో "క్రికెట్ పుట్టినిల్లైన ఇంగ్లండ్ ఇంతవరకు వరల్డ్‌కప్ గెలవలేదు'' అని అంటాడు.

ఇక దీనిని తాజా గెలుపుకు అన్వయిస్తూ "బాలయ్య ఏదో ఫ్లోలో అంటే ఇంగ్లండ్ టీమ్ సీరియస్‌గా తీసుకుంది. అందుకే ఈసారి వరల్డ్‌కప్ కొట్టింది'' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఇంగ్లాండ్ జులై 14న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించినట్లు అభిమానులు చెప్పుకుంటున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.

ఈ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. చివరకు బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు. తద్వారా 44 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది.

Story first published: Tuesday, July 16, 2019, 19:40 [IST]
Other articles published on Jul 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X