న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యుజ్వేంద్ర చహల్‌కు కాబోయే సతీమణి ధనశ్రీ గురించి తెలుసా?!!

Do you know about Dhanashree Verma?, fiance of Yuzvendra Chahal?
కొరియోగ్రఫర్ Dhanashree Verma తో Yuzvendra Chahal నిశ్చితార్థం || Oneindia Telugu

ముంబై: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. తన మనసుకు నచ్చిన అమ్మాయి ధనశ్రీ వర్మతో రోకా (నిశ్చితార్థం) జరిగిందని చహల్‌ శనివారం సోషల్ మీడియాలో ప్రకటించాడు. 'మా కుటుంబాలతో పాటు మేమిద్దరమూ "అవును" అనేశాం. #రోకా వేడుక' అని పోస్ట్ చేశాడు. ఇక తన నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన చిత్రాలను అభిమానులతో పంచుకున్నాడు. అయితే చహల్‌కు కాబోయే సతీమణి ధనశ్రీ గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. వారికోసం కొంత సమాచారం.

డెంటిస్ట్‌:

డెంటిస్ట్‌:

ముంబైకి చెందిన ధనశ్రీ వర్మ ఓ డెంటిస్ట్‌. 2014లోనే ఆమె నవీ ముంబయిలోని డీవై పాటిల్‌ డెంటల్‌ కళాశాల నుంచి డిగ్రీ పొందారు. అయితే కొరియోగ్రఫీ అంటేనే ధనశ్రీకి ఎక్కువ ఇష్టం. ఆమెకు ధనశ్రీ వర్మ పేరిట ఓ డ్యాన్స్‌ అకాడమీ కూడా ఉంది. ఆమె సొంత యూట్యూబ్‌ ఛానెల్‌కు 15 లక్షల మందికి పైగా సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో 5 లక్షల మందికిగా పైగా అనుసరిస్తున్నారు. చహల్‌తో నిశ్చితార్థం అయినట్టు పెట్టిన ఇన్‌స్టా పోస్టుకు 2 లక్షకు పైగా లైకులు వచ్చాయి. కరోనా వైరస్ లాక్​డౌన్ సమయంలో జూమ్​ వర్క్​షాప్​ల్లో చహల్​-ధనశ్రీకి పరిచయం ఏర్పడినట్టు సమాచారం.

యూట్యూబ్‌ స్టార్‌గానే:

యూట్యూబ్‌ స్టార్‌గానే:

ధనశ్రీ వర్మ వృత్తిపరంగా వైద్యురాలే అయినప్పటికీ.. ఆమె యూట్యూబ్‌ స్టార్‌గానే ఎక్కువ మందికి పరిచయం. ఆమె కొరియోగ్రఫీ చేసిన కొన్ని వీడియోలకు లక్షల కొద్ది వ్యూస్‌ వస్తున్నాయి. నటుడు కార్తీక్‌ ఆర్యన్‌, సింగర్‌ గురు రంద్వాతో కలిసి ధనశ్రీ డ్యాన్స్‌ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆమె ఇన్‌స్టాలో చహల్‌ చేసిన డ్యాన్స్‌ వీడియో కూడా ఉంది. 'చో గడాతరా' వీడియోకు 48 మిలియన్లు, 'ఓ సాకీ సాకీ' వీడియోకు 16 మిలియన్ల వీక్షణలు ఉన్నాయి.

కామెంట్ సింపుల్‌గానే ఉన్నా:

కామెంట్ సింపుల్‌గానే ఉన్నా:

యుజ్వేంద్ర చహల్ నిశ్చితార్థం సందర్భంగా అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, ఆకాశ్‌ చోప్రా,కేఎల్‌ రాహుల్‌, ఇంగ్లండ్ మహిళా క్రికెటర్‌ డేనీ వ్యాట్‌, రోహిత్‌ శర్మ, వాషింగ్టన్ ‌సుందర్‌, హార్దిక్‌ పాండ్యా, మన్‌దీప్‌ సింగ్‌ తదితరులు అభినందనలు తెలియజేశారు. రోహిత్ వైరిటీగా విషెస్ చెప్పాడు. ఓ ఫన్నీ మీమ్‌ను షేర్ చేస్తూ.. 'భాయ్ నిశ్చితార్థం చేసుకున్నందుకు కంగ్రాట్స్. అంతా మంచే జరగాలిని కోరుకుంటున్నా' అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. అయితే కామెంట్ సింపుల్‌గానే ఉన్నా. అర్ధం మాత్రం వేరేలా ఉంది. 2050లో రాయల్ ‌చాలెంజర్స్ బెంగళూరు యువ అభిమానితో చహల్ అంటూ యుజీ పోలీకలతో ఉన్న ఓ ఓల్డ్‌మ్యాన్, యంగ్ మ్యాన్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశాడు.

ఎంతో ఉత్సాహంగా:

ఎంతో ఉత్సాహంగా:

అంతర్జాతీయ కెరీర్‌లో యుజ్వేంద్ర చహల్ ఇప్పటివరకు 52 వన్డేల్లో, 42 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. యూఏఈలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని చహల్ ఇటీవలే చెప్పాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి యూఏఈలో జరుగనున్న సంగతి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మణికట్టు మాంత్రికుడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చహల్ 84 ఐపీఎల్ మ్యాచులలో 100 వికెట్లు పడగొట్టాడు.

కుంబ్లేని కెరీర్ తొలి నాళ్లలో అంతా ఏమని పిలిచేవారో తెలుసా?!!

Story first published: Monday, August 10, 2020, 18:32 [IST]
Other articles published on Aug 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X