న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విచారణకై కమిటీ.. రాహుల్ జోహ్రీ పదవికే ఎసరపెట్టనుందా??

Divided COA Sets up Committee to Probe #MeToo Charge Against Johri

హైదరాబాద్: రంగాలకు అతీతంగా రోజురోజుకూ తీవ్రతరం అయిపోతోంది. మీటూ ఉద్యమం బాధ్యుడు ఎంతటి వాడైనా సరే.. ఆరోపణ వచ్చిందంటే నిరూపించుకోవాల్సిందే. ఇవి బీసీసీఐ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న రాహుల్ జోహ్రీని వదల్లేదు. కొద్ది రోజుల కిందట అతనిపై మీటూ నేపథ్యంలో ఓ మహిళ ఆరోపించారు. అయితే వాటిపై స్పష్టత వచ్చేంత వరకూ ఐసీసీ సమావేశాలకు కూడా హాజరు కావడానికి వీల్లేదంటూ బీసీసీఐ అతనిపై ఆంక్షలు విధించింది.

రాహుల్ జోహ్రీపై 3 సభ్యులతో కూడిన విచారణ

రాహుల్ జోహ్రీపై 3 సభ్యులతో కూడిన విచారణ

ఈ క్రమంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్ జోహ్రీపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని బీసీసీఐ పాలకుల కమిటీ తాజాగా నియమించింది. 2016లో బోర్డు సీఈవోగా బాధ్యతలు చేపట్టకముందు రాహుల్ జోహ్రీ.. డిస్కవరీ నెట్‌వర్క్స్‌లో ఉన్నత పదవుల్లో పనిచేశాడు. ఆ సమయంలో.. తనకి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మభ్యపెట్టినట్లు ఇటీవల ఓ మహిళ సోషల్ మీడియాలో ఆరోపించింది.

'నన్నెందుకు ఎంపిక చేయలేదో అర్థం కావడం లేదు'

14రోజుల్లోగా వివరణ ఇవ్వాలని

14రోజుల్లోగా వివరణ ఇవ్వాలని

దీంతో.. ఈ ఆరోపణలపై 14రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పరిపాలక కమిటీ రెండు వారాల క్రితం ఆదేశించగా.. శనివారం రాహుల్ జోహ్రి ఆ ఆరోపణల్ని కొట్టివేస్తూ తన వివరణని కమిటీకి సమర్పించాడు. కమిటీలోని మహిళా సభ్యురాలు డయానా ఎడుల్జి ఆ వివరణపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సీఈవోని పదవి నుంచి అతడ్ని తప్పించాలని అభిప్రాయపడింది.

నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుందామని

నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుందామని

రాహుల్ జోహ్రీ వివరణపై సోమవారం జరిగిన సమావేశంలో పరిపాలక కమిటీ చర్చించింది. రాహుల్ జోహ్రీపై చర్యలు తీసుకునేందుకు నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది. బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపేందుకు సీఓఏ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది.

15రోజుల్లోపు నివేదిక ఇవ్వనున్న కమిటీ

15రోజుల్లోపు నివేదిక ఇవ్వనున్న కమిటీ

ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ రాకేశ్ శర్మ ఛైర్మన్‌గా, ఢిల్లీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ బరాఖ్ సింగ్, సీబీఐ మాజీ డైరెక్టర్ పీసీ వర్మతో ఓ కమిటీని నియమించింది. 15రోజుల్లోపు ఈ కమిటీ నివేదిక ఇవ్వనుందని.. ఆ తర్వాతే రాహుల్ జోహ్రీ భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ పాలకుల కమిటీ వెల్లడించింది.

Story first published: Friday, October 26, 2018, 18:53 [IST]
Other articles published on Oct 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X