న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వీవీఎస్ లక్ష్మణ్ వరల్డ్‌కప్ జట్టులో రిషబ్ పంత్‌కి దక్కని చోటు!

VVS Laxman Predicts Indian Squad For 2019 World Cup | Oneindia Telugu
 Dinesh Karthik in, Rishabh Pant out: VVS Laxman picks Indias squad for 2019 World Cup

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది మేలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాకు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అవసరం లేదని టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీకి సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ధోని, బ్యాకప్‌ కీపర్‌గా దినేశ్‌ కార్తీక్‌లు సరిపోతారని చెప్పుకొచ్చాడు.

పన్ను మినహాయింపు లేకపోతే ఆ భారం బీసీసీఐ మోయాల్సిందేపన్ను మినహాయింపు లేకపోతే ఆ భారం బీసీసీఐ మోయాల్సిందే

సోమవారం స్టార్‌ స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్యూలో వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రిషబ్ పంత్ ఫామ్‌లో లేడని, గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో అతడు కేవలం 4, 40 నాటౌట్‌, 28, 3, 1 పరుగులే చేశాడని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. వరల్డ్‌కప్ చాలా ప్రధానమైనదని, ఇలాంటి టోర్నీలో యువ ఆటగాళ్ల కన్నా.. అనుభవం ఉన్న సీనియర్‌ ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నాడు.

సెలక్టర్లు రిషబ్ పంత్‌ను పక్కనబెట్టి సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌ను ఎంపిక చేయాలని లక్ష్మణ్ సూచించాడు. ఇక, భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని లక్ష్మణ్ కొనియాడాడు. బౌలింగ్‌ విభాగంలో నలుగురు పేసర్లు షమీ, జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌ ఖలీల్‌ అహ్మద్‌, ఇద్దరు స్పిన్నర్లు చాహల్‌, కుల్దీప్‌లతో వరల్డ్‌కప్ బరిలోకి దిగాలన్నాడు.

వరల్డ్‌కప్‌కు లక్ష్మణ్‌ ప్రకటించిన జట్టు:
రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లి, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోని, కేదార్‌జాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, యుజవేంద్ర చహల్‌, జస్ప్రిత్‌ బుమ్రా, భువనేశ్వర్‌, షమీ, రాహుల్‌ , దినేష్‌ కార్తీక్‌, ఖలీల్‌

Story first published: Monday, March 4, 2019, 14:42 [IST]
Other articles published on Mar 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X