న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Dinesh karthik In Indian Squad: ఆర్సీబీ ఫినిషర్ డీకే సెలక్షన్ పట్ల ట్విట్టర్లో సందడి మామూలుగా లేదుగా..!

Dinesh Karthik In Indian Squad: Netizens Congratulating RCB Finisher In Style

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్ 2022 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన వికెట్ కీపర్ కం బ్యాటర్ దినేష్ కార్తీక్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్టులోకి అతన్ని ఎంపిక చేసింది. 36ఏళ్ల దినేష్ కార్తీక్ చివరిసారిగా 2019ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో టీమిండియా తరఫున ఆడాడు. ఈ సీజన్‌లో అతని ఫినిషింగ్ ట్యాలెంట్ అందరినీ ఆకట్టుకుంది. లోయర్ ఆర్డర్లో 57.40సగటుతో అతను 287పరుగులు చేశాడు. కొన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు.

జెర్సీ మూవీ సీన్ రియల్‌గా రిపీట్ అయినట్లు

దినేష్ కార్తీక్ భారత జట్టుకు సెలెక్ట్ అవ్వడంతో దినేష్ కార్తీక్ అభిమానులు అతనికి శుభాకాంక్షలు చెబుతున్నారు. సరైన ప్లేయర్‌కు సరైన టైంలో అవకాశం దక్కిందంటూ ట్విట్టర్‌లో సంతోషం వెలిబుచ్చుతున్నారు. ఇక జెర్సీ సినిమాలో 36ఏళ్ల వయసులో టీమిండియాకు సెలెక్ట్ అయినప్పుడు నాని ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటాడో అలాంటి సెలబ్రేషన్స్ దినేష్ కార్తీక్ చేసుకుంటున్నట్లు ఓ నెటిజన్ మీమ్ వీడియో చేశాడు. #dineshkarthik ట్రెండింగ్లో ఉంది.

ఇప్పుడు 2019ని మార్చేయండి

దినేష్ కార్తీక్ జట్టులో స్థానం కోల్పోయిన ఒకానొక దశలో కామెంటేటర్‌గా అవతారమెత్తాడు. అప్పుడు ఓ ఛానల్ తరఫున కామెంట్రీ చేస్తున్నప్పుడు దినేష్ కార్తీక్ (2004 - 2019) వరకు టీమిండియా తరఫున ఆడినట్లు కింద పేర్కొంది. దీన్ని ఓ నెటిజన్ ప్రస్తావిస్తూ.. బాస్ ఈజ్ బ్యాక్ మీరు 2019ని తీసివేయాల్సిన టైం వచ్చిందంటూ పేర్కొన్నాడు.

దినేష్ కార్తీక్ స్ట్రగుల్ ఏంటో తెలిపేలా

దినేష్ కార్తీక్ జట్టులో కోల్పోయినప్పటి నుంచి కమ్ బ్యాక్ కావడానికి ఎంత స్ట్రగుల్ పడ్డాడో షార్ట్ గా తెలియజేసే ఓ క్లిప్ ను ఓ నెటిజన్ పోస్టు చేశాడు. నిదాస్ ట్రోఫీ ఫైనల్ గెలిపించిన అనంతరం దినేష్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లు కామెంటేటర్ గా పనిచేశాడు. ఇక అయినప్పటికీ తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని భావించాడు. డొమెస్టిక్ క్రికెట్లో ఆడుతూ తనని తాను సానబెట్టుకున్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చివరికి టీమిండియా జెర్సీ మళ్లీ ధరించబోతున్నాడంటూ ప్రస్తావించాడు.

ఫినిషర్ రోల్‌లో

2004లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుండి.. కార్తీక్ భారత జట్టులో తరచూ వస్తూ పోతూ ఉండే ప్లేయర్‌గా ఉన్నాడు. అతను ఎక్కువగా ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఆడాడు. ఇక తొలుత టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా ఉన్న దినేష్ కార్తీక్ తర్వాత లోయర్ ఆర్డర్లో ఫినిషర్ రోల్‌లోకి మారాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఫినిషర్ పాత్ర కోసం ఆర్సీబీ అతన్ని కొనుక్కోగా.. అందుకు అతను న్యాయం చేశాడు. ఒత్తిడిలో మ్యాచ్ ఉన్నప్పుడు బాగా రాణిస్తున్నాడు.

దినేష్ కార్తీక్ మోటివేషనల్ ట్వీట్

ఇక రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్ కోసం రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌లతో పాటు దినేష్ కార్తీక్‌ను వికెట్ కీపర్ కం బ్యాటర్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. ఇక ఈ సిరీస్‌లో దినేష్ కార్తీక్ కు అవకాశాలొచ్చి రాణిస్తే గనుక 2022లో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచ‌కప్‌ జట్టులో ప్లేయర్‌గా దినేష్ కార్తీక్ ఉండడంలో ఎలాంటి సందేహాలు ఉండవు. ఇక తన ఎంపిక అనంతరం దినేష్ కార్తీక్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. 'నిన్ను నువ్వు నమ్ముకుంటే అన్నీ నీ దారిలో పొందుతావు. అందరి మద్దతు, నమ్మకానికి ధన్యవాదాలు.. నా కృషి కొనసాగుతుంది' అని కార్తీక్ ట్వీట్ చేశాడు.

Story first published: Monday, May 23, 2022, 10:04 [IST]
Other articles published on May 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X