న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India, England క్రికెటర్ల జీతాలు, మ్యాచ్ ఫీజు, బోనస్‌లు ఎంతో తెలుసా?

Do you Know Indian and England Cricketers Salaries, Match Fees
India And England Cricketers Salary Difference భారీ తేడా.. వాళ్ళ జీతాలే ఎక్కువ || Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత సంపన్నపైన క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). అందుకే బీసీసీఐ చెప్పినట్లే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నడుచుకుంటుంది. ఐసీసీనే కాదు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు సైతం బీసీసీఐని పెద్దన్నగా భావిస్తాయి. భారత్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు ఆసక్తికనబరుస్తాయి. అయితే ఇంత సంపన్నమైన క్రికెట్ బోర్డుకు చెందిన భారత ఆటగాళ్ల జీతాలు కూడా ఎక్కువగా ఉంటాయని అంతా అనుకుంటారు.

కానీ వాస్తవానికి భారత్ ఆటగాళ్ల కంటే ఇంగ్లండ్ ప్లేయర్ల జీతాలు ఎక్కువ. ఇరు జట్ల వార్షిక కాంట్రాక్టులతో పాటు మ్యాచ్ ఫీజులు, బోనస్ విషయాల్లో కూడా భారీ తేడా ఉంది. బీసీసీఐ కంటే ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తమ ఆటగాళ్లకు ఎక్కువ జీతాలు అందజేస్తుంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ కంటే అతనికే ఎక్కువ జీతం.. ఎంతంటే?అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ కంటే అతనికే ఎక్కువ జీతం.. ఎంతంటే?

గ్రేడ్‌ల వారిగా..

భారత సెంట్రల్ కాంట్రాక్టులు ప్రకారం ఏ+ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి రూ.7 కోట్లు, ఏ గ్రేడ్ ప్లేయర్స్‌కు రూ. 5 కోట్లు, బీ గ్రేడ్ ఆటగాళ్లకు రూ.3 కోట్లు, సీ గ్రేడ్ ప్లేయర్లకు కోటీ రూపాయాల వార్షిక వేతనం అందుతుంది. ఇక మ్యాచ్‌ ఫీజులు టెస్ట్‌లకు రూ.15 లక్షలు, వన్డేలకు 6 లక్షలు, టీ20లకు రూ.3లక్షలు ఇస్తున్నారు. ఆటగాళ్లు సెంచరీ చేసినా లేదా 5 వికెట్లు తీసినా మరో రూ.5 లక్షలు బోనస్‌గా అందజేస్తున్నారు. డబుల్ సెంచరీ చేస్తే రూ.7లక్షలు ఇస్తున్నారు.

ఫార్మాట్ల వారిగా..

ఇంగ్లండ్ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు గమనిస్తే..మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లకు రూ. 9.8 కోట్లు, కేవలం టెస్ట్‌లు మాత్రమే ఆడే వారికి రూ.6.7 కోట్లు, లిమిటెడ్ ఫార్మాట్ ప్లేయర్లకు రూ.3.1 కోట్లను వార్షిక వేతనంగా అందజేస్తున్నారు. మ్యాచ్ ఫీజులు.. టెస్ట్‌లకు రూ.18.5 లక్షలు, వన్డేలు 10 లక్షలు, టీ20లకు రూ.5.1 లక్షలు ఇస్తున్నారు. మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్‌కు కెప్టెన్‌కు 25 శాతం బోనస్‌గా సాలరీ అందుతుంది.

తేడా ఎంతంటే..?

తేడా ఎంతంటే..?

ఇరు జట్ల ఆటగాళ్ల జీతాలు పరిశీలిస్తే.. భారత క్రికెటర్ల కంటే ఇంగ్లండ్ ప్లేయర్లు సుమారు రూ.2.8 కోట్లు అదనంగా జీతం అందుకుంటున్నారు. మ్యాచ్ ఫీజుల్లో కూడా భారీ తేడానే ఉంది. టెస్ట్‌లకు రూ.3.5 లక్షలు, వన్డేలకు రూ.4 లక్షలు, టీ20లకు రూ.2.1 లక్షల వ్యత్యాసం ఉంది. అయితే బోనస్ విషయంలో మాత్రం టీమిండియా ఆటగాళ్లదే పై చేయి. ఇంగ్లండ్ కేవలం తమ కెప్టెన్‌కు మాత్రం బోనస్ అందజేస్తుండగా.. భారత్ వ్యక్తిగత ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇస్తుంది. ఈ వ్యత్యాసంతోనే ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జోరూట్ అందరి సారథుల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నాడు.

Story first published: Wednesday, June 9, 2021, 14:54 [IST]
Other articles published on Jun 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X