న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్-ఏ జట్టులో ముగ్గురు తెలుగమ్మాయిలకు చోటు.. వైస్ కెప్టెన్‌గా మేఘన!!

Devika Vaidya to Lead India A Womens Team in Bangladesh A and Emerging Asia Cup

ఆదోని: గతంలో ఎన్నడూ లేనివిధంగా భారత మహిళల క్రికెట్‌ ఏ-జట్టుకు ముగ్గురు తెలుగమ్మాయిలు ఎంపికయ్యారు. హేమలతా కళ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ మంగళవారం బంగ్లాదేశ్‌-ఎ జట్టుతో తలపడే మహిళల క్రికెట్‌ ఏ-జట్టును ఎంపిక చేశారు. 15 మంది సభ్యుల జట్టులో ముగ్గురు తెలుగమ్మాయిలు ఉండడం విశేషం. అంతేకాదు అందులో ఒకరు వైస్‌ కెప్టెన్‌గా కూడా నియమితులయ్యారు.

<strong>ఫిఫా క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ ప్రదర్శన అదరహో!!</strong>ఫిఫా క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ ప్రదర్శన అదరహో!!

అంజలికిదే తొలి అంతర్జాతీయ టోర్నీ:

అంజలికిదే తొలి అంతర్జాతీయ టోర్నీ:

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అంజలి శర్వాణితో పాటు సీనియర్ క్రీడాకారిణిలు అయిన సబ్బినేని మేఘన, రావి కల్పనలు భారత మహిళల క్రికెట్‌ ఏ-జట్టులో అవకాశం పొందారు. మేఘన, కల్పన ఇప్పటికే పలు అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడగా.. అంజలికిదే తొలి అంతర్జాతీయ టోర్నీ. రైట్ ఆర్మ్ మీడియం పేసరైన అంజలి ఇటీవల గువాహటిలో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీలో భారత రెడ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. ఆ టోర్నీలో అంజలి అద్భుతంగా రాణించడంతో బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడింది.

కెప్టెన్‌గా దేవికా వైద్య:

కెప్టెన్‌గా దేవికా వైద్య:

భారత ఏ-జట్టు బంగ్లాదేశ్‌-ఎ జట్టుతో మూడు అనధికార వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఈ పర్యటన అక్టోబరు 4న ప్రారంభం కానుంది. అక్టోబర్ 4, 6, 8 తేదీల్లో వన్డే మ్యాచులు.. అక్టోబర్ 11, 12, 14 తేదీల్లో టీ20లు జరుగుతాయి. బంగ్లాదేశ్‌-ఎ పర్యటనతో పాటు శ్రీలంకలో జరిగే ఎమర్జింగ్‌ ఉమెన్స్‌ ఆసియాకప్‌లో పాల్గొనే భారత-ఎ జట్టు కూడా ఇదే. బంగ్లాదేశ్‌ పర్యటన అనంతరం భారత-ఎ జట్టు శ్రీలంకకు వెళుతుంది. భారత-ఎ జట్టుకు దేవికా వైద్య కెప్టెన్‌గా, మేఘన వైస్‌ కెప్టెన్‌గా నియమితులయ్యారు.

India A tour to Bangladesh A:

India A tour to Bangladesh A:

Devika Vaidya (Captain), S Meghana (vice-captain), Yastika Bhatia, Tejal Hasabnis, Tanushree Sarkar, Simarn Dil Bahadur, Nuzhat Parveen, R Kalpana, Manali Dakshini, Kshama Singh, Anjali Sarwani, Minnu Mani, Sushree Dibyadarshini, TP Kanwar, Rashi Kanojia.

అఫ్గాన్‌ విజయంపై రాజస్థాన్‌ ట్వీట్‌: ట్రోల్స్‌ చేసిన నెటిజన్లు.. ఎందుకో తెలుసా?

Emerging Women's Asia Cup:

Devika Vaidya (Captain), S Meghana (vice-captain), Yastika Bhatia, Tejal Hasabnis, Tanushree Sarkar, Simarn Dil Bahadur, Nuzhat Parveen, R Kalpana, Manali Dakshini, Kshama Singh, Anjali Sarwani, Minnu Mani, Sushree Dibyadarshini, TP Kanwar, Rashi Kanojia.

Story first published: Wednesday, September 11, 2019, 12:03 [IST]
Other articles published on Sep 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X