అఫ్గాన్ విజయంపై రాజస్థాన్ ట్వీట్: ట్రోల్స్ చేసిన నెటిజన్లు.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు ట్విట్టర్ ఖాతా ద్వారా అభినందనలు తెలిపి అబాసుపాలైంది. నెటిజన్లు భారీగా ట్రోల్స్ చేయడంతో జ్ఞానోదయం అయిన రాజస్థాన్ ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించింది. విషయంలోకి వెళితే.

తొలి విజయం ఎప్పటికీ ప్రత్యేకమే
రషీద్ ఖాన్ అధ్వర్యంలో చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్ 224 పరుగుల భారీ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. విజేతగా నిలిచిన పసికూన అఫ్గాన్ జట్టుకు రాజస్థాన్ రాయల్స్ అభినందలు తెలుపుతూ ఓ ట్వీట్ చేసింది. 'తొలి విజయం ఎప్పటికీ ప్రత్యేకమే. టెస్టు క్రికెట్‌లో తొలి విజయం సాధించిన అఫ్గాన్‌కు అభినందలు' అని రాసుకొచ్చింది.

ట్రోల్స్ చేసిన నెటిజన్లు:
అయితే అఫ్గానిస్థాన్‌కు టెస్ట్ ఫార్మాట్‌లో ఇది రెండో విజయం. అఫ్గాన్ తొలి విజయాన్ని ఐర్లాండ్‌పై నమోదు చేసింది. బంగ్లాదేశ్‌పై సాధించింది రెండో విజయం. దీంతో నెటిజన్లు రాజస్థాన్ రాయల్స్ ట్వీట్‌పై భారీ స్థాయిలో ట్రోల్స్ మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న రాజస్థాన్ రాయల్స్ నెటిజన్ల దెబ్బకి వెంటనే తన ట్వీట్‌ను డిలీట్ చేసింది.

తొలి టెస్టులో ఓటమి:
గతేడాది టెస్టు హోదా పొందిన అఫ్గానిస్థాన్ ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడింది. తొలి టెస్టులో భారత్ చేతిలో ఓడిన అఫ్గాన్.. రెండో టెస్టులో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. తాజాగా బంగ్లాపై నెగ్గి రెండో విజయాన్ని అందుకుంది. పలితంగా టెస్ట్ హోదా పొందిన తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండింటిలో విజయం సాధించి తక్కువ మ్యాచ్‌లలో రెండు టెస్ట్ విజయాలు నమోదు చేసిన ఆస్ట్రేలియా దీర్ఘకాలిక రికార్డును సమం చేసింది.
ఫిఫా క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ ప్రదర్శన అదరహో!!

నబీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు:
398 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా చివరి రోజు నాలుగు వికెట్లను కోల్పోయి 173 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ టెస్టులో రషీద్‌ఖాన్ కీలకపాత్ర పోషించాడు. అర్ధశతకంతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రషీద్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ అనంతరం అఫ్గాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications