న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB Records: ఐపీఎల్ ట్రోఫీ గెలవకుంటే ఏంటీ.. ఎవరికీ సాధ్యం కానీ ఈ 7 రికార్డులు ఆర్సీబీవే

 Despite not lifting IPL trophy, seven Impossible records are in the name of RCB

2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంచైజీలలో ఒకటిగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కూడా ఆర్సీబీ గెలవనప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం ఆర్సీబీని ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఏ ఫ్రాంఛైజీకి లేనటువంటి లోయాల్టీ ఫ్యాన్స్ ఆర్సీబీ సొంతం. ట్రోఫీ గెలిచినా, గెలవకున్నా ఆర్సీబీ పట్ల తమ అభిమానాన్ని చెక్కుచెదరనీయరు. ఇకపోతే ఆర్సీబీ ట్రోఫీ గెలవకుంటే ఏంటీ.. ఐపీఎల్ చరిత్రలో ఎవరికి సాధ్యం కానీ 7రికార్డులు ఇప్పటికీ ఆర్సీబీ పేరిటే ఉన్నాయి.

 ఐపీఎల్లో అత్యధిక జట్టు స్కోరు - 263

ఐపీఎల్లో అత్యధిక జట్టు స్కోరు - 263

ఐపీఎల్‌లో అత్యధికంగా 263/5 స్కోరును ఛేదించిన రికార్డు RCB పేరిట ఉంది. 2013లో బెంగుళూరులో పూణే వారియర్స్ మీద ఆర్సీబీ జట్టు 5వికెట్లు కోల్పోయి 263పరుగులు చేసింది. క్రిస్ గేల్ కేవలం 66బంతుల్లో 175పరుగులు, తిలకరత్నే దిల్షాన్ 36 బంతుల్లో 33, డివిలియర్స్ 8బంతుల్లో 31 చెలరేగి ఆడడంతో ఈ భారీ స్కోరు నమోదైంది. తదనంతరం ఈ మ్యాచ్‌లో 130పరుగుల భారీ తేడాతో ఆర్సీబీ గెలుపొందింది.

 ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు - క్రిస్ గేల్ (175)

ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు - క్రిస్ గేల్ (175)

2013 ఏప్రిల్ 13రోజు క్రికెట్లో సునామీ వచ్చింది. దాని పేరు క్రిస్ గేల్. యూనివర్స్ బాస్ పూణే సూపర్ జెయింట్స్ మీద 66 బంతుల్లో 175పరుగులు చేసి భీకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా చరిత్రపుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. 265.17స్ట్రైక్ రేట్‌తో 13ఫోర్లు, 17సిక్సర్లతో పూణే బౌలర్లను ఊచకోత కోశాడు. ఐపీఎల్ తో సహా అన్ని టీ20టోర్నీల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే.

 ఐపీఎల్లో అత్యధిక భాగస్వామ్యం - కోహ్లీ, డివిలియర్స్ (229)

ఐపీఎల్లో అత్యధిక భాగస్వామ్యం - కోహ్లీ, డివిలియర్స్ (229)

క్రికెట్లో ఏ ఫార్మాట్‌లోనైనా భాగస్వామ్యాలు చాలా కీలకం. టీ20 ఫార్మాట్‌లో 200 ప్లస్ పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం అంటే మాటలు కాదు. దాన్ని ఆర్సీబీయన్లు చేసి చూపించారు. 2016 ఎడిషన్‌లో ఆర్సీబీ ప్లేయర్లు ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో గుజరాత్ లయన్స్ టీంపై రెండో వికెట్‌కు 229పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లీగ్ చరిత్రలో ఏ వికెట్ కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇది టీ20 క్రికెట్‌లో రెండో అత్యధిక భాగస్వామ్యం. ఈ మ్యాచ్‌లో కోహ్లి 55 బంతుల్లో 109 పరుగులు చేయగా, డివిలియర్స్ కేవలం 52బంతుల్లో 129పరుగులు చేశాడు.

 ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు (15)

ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు (15)

ఆర్సీబీ బ్యాటర్లు లీగ్ చరిత్రలో అత్యధికంగా 15 సెంచరీలు చేశారు. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఐదు సెంచరీలతో చెలరేగగా, డివిలియర్స్ రెండు సెంచరీలు, మనీష్ పాండే, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్‌ ఒక్కొక్క సెంచరీ చేశారు. టీంల పరంగా అత్యధికంగా సెంచరీలు చేసిన టీం ఆర్సబీ.

 ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ - విరాట్ కోహ్లీ (973)

ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ - విరాట్ కోహ్లీ (973)

ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2016సీజన్లో అరివీర భయంకర ఫాంలో ఉన్నాడు. ఆ సీజన్లో కోహ్లీ 973పరుగులు చేశాడు. 16 ఇన్నింగ్స్‌లలో 81.08 సగటుతో 152.03 స్ట్రైక్ రేట్‌తో ఈ స్కోరు సాధించాడు. అత్యధిక స్కోరు 113. కోహ్లీ ఈ సీజన్లో 83 ఫోర్లు, 38సిక్సులతో 4 సెంచరీలు, 7హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్‌లోనే కాదు. ఐపీఎల్లో ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కోహ్లీనే.

 ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ప్లేయర్ - క్రిస్ గేల్ (17)

ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ప్లేయర్ - క్రిస్ గేల్ (17)

2013లో బెంగుళూరులో పూణే సూపర్ జెయింట్స్ మీద గేల్ తుఫాన్ ఇన్నింగ్స్ 66 బంతుల్లో 175* పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 13 ఫోర్లతో సహా 17సిక్సర్లను గేల్ కొట్టాడు. తద్వారా ఐపీఎల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా గేల్ నిలిచాడు. అతను కేవలం ఫోర్లు, సిక్స్‌ల ద్వారా 154పరుగులు చేశాడు.

 ఒకే జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు - విరాట్ కోహ్లీ (223)

ఒకే జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు - విరాట్ కోహ్లీ (223)

ఐపీఎల్‌లో ఒకే జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ఆర్‌సీబీ మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. కోహ్లీ ఆర్సీబీ తరఫున 223 మ్యాచ్‌లు ఆడాడు. 2008లో లీగ్ ప్రారంభమైనప్పటి నుండి అదే జట్టులో ఆడిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు.

Story first published: Friday, June 3, 2022, 10:26 [IST]
Other articles published on Jun 3, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X