న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Deep Dasgupta : వీళ్లెవరు కాదండి.. మూడో ఓపెనర్ ఛాయిస్‌గా అతన్ని తీసుకోండి.. ఉన్నంతసేపు దడదడే..!

Deep Dasgupta advices Prithvi shaw Is Third Better Choice for Opening

అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2022కు ఉత్తమ టీంను ఎంపిక చేయడానికి టీమిండియా అనేక ప్రయోగాలు చేస్తోంది. ఓపెనింగ్ జోడీ విషయంలో కూడా ప్రయోగాలు జరిగాయి. బ్యాటింగ్ లైనప్‌ విషయంలో ఏ ప్లేయర్ ఏ స్థానంలో దిగితే బాగుంటుందనే విషయంలోనూ కొన్ని ప్రయోగాలు జరిగాయి. ఇదిలా ఉండగా.. భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ఓపెనర్ల లిస్టులో మూడో ఎంపికగా ఓ కొత్త పేరును ప్రతిపాదించారు. ఇటీవల టీమిండియా మేనేజ్‌మెంట్ రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్‌లతో ఓపెనర్లుగా ప్రయోగాలు చేయగా.. పంత్ కంటే సూర్య బెటర్ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే.

అయితే పంత్ ఇంగ్లాండ్‌ లాంటి దుర్భేద్యమైన టీంతో ఓపెనర్‌గా బరిలోకి దిగగా.. సూర్య వెస్టిండీస్ లాంటి జట్టుతో ఓపెనర్‌గా దిగి సత్తా చాటాడు. ఇకపోతే ఇంగ్లాండ్ మీద సూర్య మిడిలార్డర్లో దిగి సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి.. ఏ స్థానంలో దిగిన మిస్టర్ నయా 360డిగ్రీ ప్లేయర్ సూర్యకు పర్వాలేదు. ఇకపోతే దీస్ దాస్ గుప్తా అభిప్రాయం ప్రకారం.. సెలెక్టర్లు పృథ్వీ షాను మూడో ఓపెనర్‌ ఛాయిస్‌గా ప్రయత్నించాలని అభిప్రాయపడ్డాడు.

'కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడీకి ఫస్ట్ చాయిస్. ఓపెనర్ స్లాట్‌లో మూడో ఛాయిస్ కోసం భిన్నమైన నైపుణ్యాన్ని కలిగిన పృథ్వీ షాను తీసుకుంటే మంచింది. అతను ఎలా మొదలెడుతాడో తెలిసిందే. అతను 70లు, 80లు లేదా సెంచరీలు బాదేయడు కానీ.. స్టార్టింగ్ ట్రబుల్ లేకుండా దూకుడుగా ఆడతాడు. ఉన్నంత సేపు దడదడలాడిస్తాడు' అని దాస్‌గుప్తా క్రిక్ట్రాకర్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపాడు.

ఇకపోతే షా చివరిసారిగా 2021జూలైలో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా తరపున ఆడాడు. అతను ఆ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. కానీ షా ఐపీఎల్ 2022లో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 10 మ్యాచ్‌లలో 152.97స్ట్రైక్‌తో 283పరుగులు చేశాడు. అలాగే దాస్‌గుప్తా ఓపెనర్ స్థానానికి మరో అవకాశంగా ఇషాన్ కిషన్‌ను పరిగణించాడు. అయితే అతని ప్రకారం ఇటీవల ఇషాన్ కిషన్ తన ఫామ్ కోల్పోయినట్లు కన్పిస్తున్నాడని అభిప్రాయపడ్డాడు.

Story first published: Friday, August 5, 2022, 21:38 [IST]
Other articles published on Aug 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X