న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సన్మానం రద్దు

DDCA drops plans to felicitate Virat Kohli, Gautam Gambhir and Virender Sehwag in wake of Pulwama attack

హైదరాబాద్: ఆస్ట్రేలియా చివరి వన్డేకి ముందు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని సన్మానించాలని భావించిన ఢిల్లీ డ్రిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకి ఐదో వన్డే జరగనున్న సంగతి తెలిసిందే.

<strong>'సగం కెప్టెన్ ధోనీనే, అతడు లేకపోతే కోహ్లీ మొరటుగా కనిపిస్తాడు'</strong>'సగం కెప్టెన్ ధోనీనే, అతడు లేకపోతే కోహ్లీ మొరటుగా కనిపిస్తాడు'

విరాట్ కోహ్లీతో పాటు సెహ్వాగ్, గంభీర్

విరాట్ కోహ్లీతో పాటు సెహ్వాగ్, గంభీర్

ఈ మ్యాచ్‌కి ముందు విరాట్ కోహ్లీతో పాటు ఢిల్లీకి చెందిన మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌లకి సన్మానం చేయాలని డీడీసీఏ తొలుత భావించింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ ఇటీవల ఐపీఎల్ 2019 ప్రారంభోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించినందు వల్ల తాము కూడా ఈ సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు డీడీసీఏ వెల్లడించింది.

ఐపీఎల్‌ 2019 ప్రారంభోత్సవం కూడా రద్దు

ఐపీఎల్‌ 2019 ప్రారంభోత్సవం కూడా రద్దు

ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్‌ 2019 ప్రారంభోత్సవానికి అయ్యే మొత్తాన్ని అమర జవాన్ల కుటుంబాల సంక్షేమం కోసం బీసీసీఐ విరాళంగా ప్రకటించగా.. డీడీసీఏ కూడా రూ. 10 లక్షలు ఢిల్లీ పోలీసుల సంక్షేమ నిధికి విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపింది.

కోహ్లీ, సెహ్వాగ్‌, గంభీర్‌ను సత్కరించాలని అనుకున్నాం

కోహ్లీ, సెహ్వాగ్‌, గంభీర్‌ను సత్కరించాలని అనుకున్నాం

"కోహ్లీ, సెహ్వాగ్‌, గంభీర్‌ను సత్కరించాలని అనుకున్నాం. కానీ ఐపీఎల్‌ ఆరంభోత్సవాన్ని బీసీసీఐ రద్దు చేయడంతో మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా ఢిల్లీ పోలీసు అమరవీరుల నిధికి రూ.10 లక్షలు విరాళం ఇవ్వాలని నిర్ణయించాం. చివరి వన్డే కోసం ఇప్పటి వరకూ అమ్మకానికి పెట్టిన టికెట్లలో 90 శాతం అమ్ముడయ్యాయి" అని డీడీసీఏ అధ్యక్షుడు రజత్‌ శర్మ తెలిపాడు.

ఐదు వన్డేల సిరిస్ సిరిస్ 2-2తో సమం

ఐదు వన్డేల సిరిస్ సిరిస్ 2-2తో సమం

"టీమిండియా తరపున ప్రాతినిథ్యం వహించిన ఢిల్లీ మాజీ ఆటగాళ్లకు గౌరవం దక్కాలి. కాబట్టి వాళ్లకు వన్డే మ్యాచ్‌ల వీఐపీ పాసులు అందిస్తున్నాం" అని డీడీసీఏ అధ్యక్షుడు రజత్‌ శర్మ తెలిపాడు. ఈ సిరిస్‌లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలవడంతో సిరిస్ 2-2తో సమం అయింది. దీంతో ఆఖరి మ్యాచ్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది.

Story first published: Tuesday, March 12, 2019, 14:44 [IST]
Other articles published on Mar 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X