న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడో భారత ఆటగాడిగా అరుదైన ఘనత: కోహ్లీ, రైనాల సరసన రోహిత్ శర్మ

IPL 2019 : Rohit Sharma Scores 8000 T20 Runs || Oneindia Telugu
Rohit Sharma

హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌ రోహిత్‌శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ టీ20ల్లో 8వేల పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 30 పరుగులు నమోదు చేసి ఔటయ్యాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

సురేశ్‌ రైనా, విరాట్‌ కోహ్లీల సరసన రోహిత్ శర్మ

ఈ మ్యాచ్‌కు ముందు 8వేల మైలురాయిని చేరడానికి 12 పరుగుల దూరంలో ఉన్నాడు. రోహిత్ కంటే ముందు సురేశ్‌ రైనా, విరాట్‌కోహ్లీలు ఈ ఘనత సాధించారు. రైనా 295 ఇన్నింగ్స్‌లో 8216 పరుగులు చేయగా.. కోహ్లీ 246 ఇన్నింగ్స్‌లో 8183 పరుగులు చేశాడు. మరోవైపు రోహిత్‌ శర్మ 294 ఇన్నింగ్స్‌లో 8వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

అగ్రస్థానంలో క్రిస్‌గేల్‌

అగ్రస్థానంలో క్రిస్‌గేల్‌

కాగా, ఈ జాబితాలో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్‌ 12670 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ 9922 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు భారత క్రికెటర్లు సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మలు వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసిన ముంబై

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లు రోహిత్‌శర్మ(30), క్వింటన్‌ డికాక్‌(35) దూకుడుగా ఆడి మంచి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించిన తర్వాత రోహిత్‌ శర్మ(30) తొలి వికెట్‌గా ఔటయ్యాడు.

Story first published: Thursday, April 18, 2019, 22:45 [IST]
Other articles published on Apr 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X