న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంధ్య వెలుగులో పింక్ బాల్‌: డే నైట్ టెస్టులో అంపైర్లు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇదే!

India Vs Bangladesh, Day-Night Test : Umpires Should Attend Training Sessions || Oneindia Telugu
Day-Night Test: Umpires should attend training sessions to get used to pink colour: Taufel

హైదరాబాద్: సంధ్య వెలుగులో పింక్ బాల్‌ని గుర్తించడం బ్యాట్స్‌మెన్‌కే కాదు అంపైర్లకూ ఓ ఛాలెంజేనని మాజీ అంపైర్‌ సైమన్‌ టౌఫెల్‌ తెలిపాడు. కొత్త బంతి రంగుకు అలవాటు పడేందుకు అంఫైర్లు కూడా ఆటగాళ్ల నెట్ ప్రాక్టీస్‌కు హాజరు కావాలని ఈ సందర్భంగా సూచించాడు.

2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి తొలి డే/నైట్‌ టెస్టుకు సైమన్ టౌఫెల్ అంఫైర్‌గా వ్వవహారించడంతో పాటు ట్రైనింగ్ మేనేజర్ కూడా పని చేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో పాత పింక్ బాల్‌ని మరింత మెరుగ్గా చూసేందుకు అంపైర్లు కృత్రిమ అద్దాలు ధరించొచ్చని అన్నాడు.

డే నైట్ టెస్టులో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను ఎలా బోల్తా కొట్టిస్తానంటే!డే నైట్ టెస్టులో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను ఎలా బోల్తా కొట్టిస్తానంటే!

బంతిని భిన్నంగా చూసేందుకు

బంతిని భిన్నంగా చూసేందుకు

"బంతిని భిన్నంగా చూసేందుకు భారత్‌-బంగ్లా మ్యాచ్‌ అంపైర్లు స్పెషల్ లెన్సెస్ ధరిస్తారో లేదో నాకు తెలియదు. అది వారికి సంబంధించిన విషయం. కానీ, వారు నెట్ ప్రాక్టీస్ సెషన్లకు హాజరయ్యే అవకాశం ఉంది. దీనివల్ల సరైన సమయంలో సరైన అంశాలే చూడగల ఆత్మవిశ్వాసం వస్తుంది. సంధ్యవెలుగులో బంతిని గుర్తించడం బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌. అంపైర్లకూ ఇదే ఓ ఛాలెంజ్ కానుంది" అని సైమన్ టౌఫెల్ అన్నాడు.

‘ఫైండింగ్‌ ద గ్యాప్’ పుస్తక ప్రమోషన్‌లో

‘ఫైండింగ్‌ ద గ్యాప్’ పుస్తక ప్రమోషన్‌లో

తన ఆటో బయోగ్రఫీ ‘ఫైండింగ్‌ ద గ్యాప్' పుస్తక ప్రమోషన్‌లో భాగంగా సైమన్ టౌఫెల్ ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నారు. నవంబర్ 22 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ప్రతిష్టాత్మక డే/నైట్‌ టెస్టుకు సైమన్ టౌఫెల్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. పింక్ బాల్‌తో ఎలాంటి అనుభవం లేని బంగ్లా క్రికెటర్లు ఈ టెస్టులో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.

పింక్ బాల్‌తో ఆడిందో లేదో

పింక్ బాల్‌తో ఆడిందో లేదో

"దేశవాళీ పోటీల్లో బంగ్లాదేశ్‌ పింక్ బాల్‌తో ఆడిందో లేదో తెలియదు. రెండు జట్ల మధ్య వారు (బంగ్లాదేశ్) ఆడేందుకు అతిపెద్ద సవాల్‌ను కలిగి ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వారికి అలవాటు లేని కొత్త రంగు బంతితో ఆడుతున్నారు. మంచు కురిస్తే ఫీల్డింగ్‌ కష్టమవుతుంది. బంతి రంగు, ప్రవర్తనను గమనించాల్సి ఉంటుంది" అని సైమన్ టౌఫెల్ అన్నాడు.

సచిన్ సరసన చేరేనా? అడిలైడ్ టెస్టులో నసీమ్ షా, అందరి చూపు అతడివైపే!

ఏ దశలో కొత్త బంతిని ఇవ్వాలో

ఏ దశలో కొత్త బంతిని ఇవ్వాలో

"ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఏ దశలో కొత్త బంతిని ఇవ్వాలో అంపైర్లు పరిగణనలోకి తీసుకోవాలి. 50 ఓవర్ల వరకు తెలుపు బంతిని రక్షించడమే మాకు కష్టమవుతుంది. ఇప్పుడు పింక్ బాల్‌ని 80 ఓవర్ల వరకు కొనసాగించాలని అంటున్నారు. టీమిండియా సీమర్ల బౌలింగ్‌ను బ్యాట్స్‌మెన్‌ మరింత శ్రద్ధతో గమనించాలి" అని టౌఫెల్ అన్నాడు.

భారత సీమర్‌లను అర్థం చేసుకోవడంపై

భారత సీమర్‌లను అర్థం చేసుకోవడంపై

"నేను బ్యాట్స్‌మన్‌గా ఉంటే, భారత సీమర్‌లను అర్థం చేసుకోవడంపై నేను ఎక్కువ దృష్టి పెడతాను. స్పిన్నర్లను అగౌరవ పరచొద్దు. అశ్విన్‌, జడేజా, కుల్‌దీప్‌ వంటి నాణ్యమైన స్పిన్నర్లు కోహ్లీసేనలో ఉన్నారు. టెస్టు క్రికెట్‌ను బ్రతికించుకోడానికి డే/నైట్‌ టెస్టులు మాత్రమే పరిష్కారం కాదు. మరెన్నో సంస్కరణలు అవసరం" అని టాఫెల్‌ తెలిపాడు.

Story first published: Wednesday, November 20, 2019, 9:16 [IST]
Other articles published on Nov 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X