న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సూపర్ స్టార్ మహేశ్‌కు డేవిడ్ వార్నర్‌ ‘మైండ్ బ్లాక్‌' విషెస్

David Warner, wife Candice shake leg on Mind Block, wish South megastar Mahesh Babu on his 45th birthday

సిడ్నీ: టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు నేడు 45వ బర్త్‌డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అతనికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులతో పాటు సినీ, రాజకీయ, క్రీడా రంగాల ప్రముఖులు ప్రిన్స్ మహేశ్‌కు విషెస్ తెలియజేశాడు. దీంతో
ట్విటర్‌లో #HBDMaheshBabu హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ కూడా మహేశ్‌కు తనదైన శైలిలో బర్త్‌డే విషెస్ చెప్పాడు.

మైండ్‌బ్లాక్ టిక్ టాక్...

మైండ్‌బ్లాక్ టిక్ టాక్...

మహేశ్ బాబు సూపర్ హిట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు'లోని ‘మైండ్ బ్లాక్' సాంగ్‌కు సతీమణి క్యాండిస్‌తో కలిసి మరోసారి చిందేయగా.. వెనుకాల అతని ముగ్గురు కూతుళ్లు వారిని అనుకరించారు. ఈ టిక్‌టాక్ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసిన వార్నర్..‘హ్యాపీ బర్త్‌డే మహేశ్ బాబు.. లెజెండ్'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వార్నర్ బర్త్‌డే విషెస్ చెప్పడంతో మహేశ్ బాబు ఫ్యాన్స్‌ తెగ సంతోషం పడుతున్నారు. ఆసీస్ ఆటగాడికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

లాక్‌డౌన్ వేళ..

లాక్‌డౌన్ వేళ..

ఇక లాక్‌డౌన్‌ వేళ ఇంటికే పరిమితమైన వార్నర్‌ టాలీవుడ్‌ అగ్రహీరోల పాటలకు, సినిమా డైలాగులకు టిక్‌టాక్‌ వీడియోలు చేసి అభిమానులు అలరించిన విషయం తెలిసిందే.అప్పుడు కూడా మహేశ్‌ బాబు మైండ్ బ్లాక్ సాంగ్‌కు టిక్ టాక్ చేశాడు. ఐపీఎల్ ద్వారా భారత అభిమానులకు మరింత చేరువైన డేవిడ్ వార్నర్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతూ రెండో హోమ్‌టౌన్‌గా మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తెలుగు హీరోల సాంగ్స్, డైలాగ్స్‌కు టిక్‌టాక్ చేస్తూ తెలుగు అభిమానులకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేశాడు.

సన్‌రైజర్స్ సారథిగా..

సన్‌రైజర్స్ సారథిగా..

ఇక డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్​రైజర్స్ హైదరాబాద్ 2016 ఐపీఎల్ టైటిల్​ను కైవసం చేసుకుంది. అయితే 2018లో బాల్​ ట్యాంపరింగ్ ఉదంతంతో నిషేధానికి గురయ్యాక.. ఏడాది పాటు ఐపీఎల్‌కు దూరమైన వార్నర్.. కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. దీంతో న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ జట్టును నడిపించాడు. గతేడాది మళ్లీ వార్నర్ ఐపీఎల్​లో పునరాగమనం చేసి 697 పరుగులతో అదరగొట్టాడు. అయితే ఈ ఏడాది సీజన్ కోసం సన్​రైజర్స్ హైదరాబాద్​ యాజమాన్యం వార్నర్​ను మరోసారి కెప్టెన్​గా నియమించింది. ఈ సీజన్​లో జట్టుకు మరో టైటిల్​ను అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతామని వార్నర్ స్పష్టం చేశాడు. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2020 నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

Story first published: Sunday, August 9, 2020, 18:10 [IST]
Other articles published on Aug 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X