న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిన్న భార్యకు.. నేడు ఫ్యాన్స్‌కు.. తెలుగులో దుమ్మురేపుతున్న డేవిడ్ వార్నర్!

David Warner says ‘Nenu mimalni eppatiki premistanu abhimanulara’ to fans in Telugu

హైదరాబాద్: ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగువారి మనసు దోచుకున్నాడు. నిన్న తన సతీమణి క్యాండిస్‌కు 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను'అంటూ తెలుగులో ప్రపోజ్ చేసిన డేవిడ్ భాయ్.. నేడు తన తెలుగుతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. స్పష్టమైన తెలుగు మాటలతో సోషల్ మీడియాను ఊపెస్తున్నాడు. తాజాగా అభిమానులారా అంటూ తెలుగు పండిట్‌గా మారిపోయాడు.

'నేను మిమ్మల్ని ఎప్పటికి ప్రేమిస్తాను అభిమానులారా. మీకు నా మీద ఉండే ప్రేమకి, ఇంకా మీ సహకారానికి ధన్యవాదాలు'అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తెలుగు అభిమానులు.. వార్నర్‌ తెలుగుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సుదీర్ఘకాలంగా ఆడుతున్న డేవిడ్ వార్నర్.. గత ఏడాది నుంచి తెలుగు సినిమా పాటలకి డ్యాన్స్ చేస్తూ అలరిస్తున్న విషయం తెలిసిందే. పాటలకే కాదు.. బాహుబాలి లాంటి సినిమా డైలాగ్‌‌లతో టిక్‌టాక్‌లో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడిన డేవిడ్ వార్నర్ 193 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నప్పటికీ.. గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటీ లేదు. మరీ ముఖ్యంగా.. సీజన్ మొత్తం.. డేవిడ్ వార్నర్ ధాటిగా ఆడలేకపోయాడు. దాంతో.. ఆ ప్రభావం జట్టుపైనా పడగా.. సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానానికి పరిమితమైంది. జట్టు వరుస ఓటములకు డేవిడ్ వార్నర్‌ను బాధ్యుడ్ని చేస్తూ అతని కెప్టెన్సీ నుంచే కాకుండా తుది జట్టు నుంచి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్పించింది.

ఐపీఎల్‌లో ఘనమైన రికార్డులున్న వార్నర్‌ని తుది జట్టు నుంచి తప్పించడంపై హైదరాబాద్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొంత మంది మాజీ క్రికెటర్లు ఇది అతన్ని అవమానించడమేనంటూ.. హైదరాబాద్ తరఫున వార్నర్‌కి ఇది ఆఖరి సీజన్‌గా అభివర్ణించారు. అయితే.. తనని కెప్టెన్సీ, తుది జట్టు నుంచి తప్పించడంపై మాత్రం డేవిడ్ వార్నర్ ఇప్పటి వరకూ స్పందించలేదు. అంతేకాకుండా 12వ ఆటగాడిగా డ్రింక్స్ మోసాడు. ఇక సన్‌రైజర్స్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతలను కేన్ విలియమ్సన్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.

Story first published: Friday, May 28, 2021, 20:30 [IST]
Other articles published on May 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X