న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికాకు షాక్.. అమెరికా జట్టుకు ఆడాలని మరో క్రికెటర్ రిటైర్మెంట్!!

Dane Piedt retires from South Africa cricket to pursue career in the USA

జొహానెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. అమెరికాలో కెరీర్ కొనసాగించాలని డేన్ పియ‌ట్‌.. దక్షిణాఫ్రికా జట్టుకు శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. కోల్‌పాక్ ఒప్పందంపై డేన్ పియ‌ట్‌ అమెరికాలో తన కెరీర్ కొనసాగించనున్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని పియ‌ట్‌ ట్విట్టర్‌లో ప్రకటించాడు. అమెరికాలో క్రికెట్ ఆడతానని, అలాగే జాతీయ జట్టు తరపున ఆడేందుకు ప్రయత్నిస్తానని పియ‌ట్‌ పేర్కొన్నాడు.

<strong>'కరోనా నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది.. నరకం అంటే ఎలాఉంటుందో చూశా'</strong>'కరోనా నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది.. నరకం అంటే ఎలాఉంటుందో చూశా'

9 టెస్టులు.. 26 వికెట్లు:

9 టెస్టులు.. 26 వికెట్లు:

డేన్ పియ‌ట్‌ దక్షిణాఫ్రికా జట్టు తరఫున 9 టెస్టులు ఆడాడు. 26 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ వేసవి తరువాత అమెరికాలో జ‌రిగే మైనర్ టీ20 లీగ్‌లో ఆడ‌నున్నట్లు పియ‌ట్‌ పేర్కొన్నాడు. మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గ‌తంలో కోల్‌పాక్ ప్లేయ‌ర్‌గా వ్యవహరించాడు. మరిన్ని మెరుగైన అవకాశాల కోసమే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఈ డీల్ ద్వారా విదేశాలకు వలస వెళ్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 'జాతీయ జట్టుకు ఆడమ‌ని పేర్కొంటూ.. కౌంటీ క్రికెట్ లేదా ఇతర దేశాలకు వలస వెళ్లడాన్ని' కోల్‌పాక్ ఒప్పందం అంటారు.

 సరైన అవకాశాలు ఇవ్వనందునే:

సరైన అవకాశాలు ఇవ్వనందునే:

కోల్‌పాక్ ఒప్పందం దక్షిణాఫ్రికా క్రికెట్‌పై బాగానే ప్రభావం చూపింది. ఇప్పటికే చాలా మంది ప్రతిభావంతులైన దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఈ ఒప్పందంపై యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లారు. ఈ జాబితాలో కైల్ అబోట్, మోర్నీ మోర్కెల్, రిలీ రోసోవ్, వెర్నాన్ ఫిలాండర్ సహా అనేకమంది ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో పియ‌ట్‌ కూడా చేరాడు. యువ, అనుభవజ్ఞులైన క్రికెటర్లకు క్రికెట్ దక్షిణాఫ్రికా బోర్డు సరైన అవకాశాలు ఇవ్వనందునే అందరూ కోల్‌పాక్ ఒప్పందంపై బయట దేశాలకు ఆడుతున్నారు.

అమెరికాకు వన్డే హోదా:

అమెరికాకు వన్డే హోదా:

'అమెరికాకు గత సంవత్సరం వన్డే హోదా ఇవ్వబడింది కాబట్టి నేను జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉంది. నేను ఆడడానికి న్యూయార్క్, చికాగో, లాస్ ఏంజిల్స్, సీటెల్ నాలుగు నగరాలను ఎంచుకున్నాను' అని డేన్ పియ‌ట్‌ తెలిపాడు. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఒక ఫొటో కూడా షేర్ చేసాడు. ఫొటో చూస్తే.. ఒప్పందంపై అతడు సంతకం చేస్తున్నాడు. సాధారణంగా ఇంగ్లాండ్ జట్టులో ఆడడం కోసం చాలామంది కోల్‌పాక్ ఒప్పందం ద్వారా వెళతారు.

Story first published: Saturday, March 28, 2020, 17:48 [IST]
Other articles published on Mar 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X