న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ వస్తా, ఆస్ట్రేలియాపై గెలుస్తా: స్టెయిన్

Dale Steyn's Heroic Stand With Bat Draws Admiration From Fans, Teammates

హైదరాబాద్: దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ జరుగుతున్న తొలి టెస్టులో గాయం కారణంగా సుమారు ఏడాది తర్వాత జట్టులో చోటు సంపాదించాడు ఆ దేశ స్టార్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌. అయితే అన్ని ఆశలతో గాయం నుంచి కోలుకున్నానని అనుకుని ఆడిన తొలి మ్యాచ్‌లోనూ మళ్లీ గాయపడ్డాడు. పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తప్పనిసరని సూచించారు. దీంతో మరోసారి ఆటకు దూరమయ్యాడు. ఆరు వారాల్లో గాయం నుంచి కోలుకుని తిరిగి బంతి పడతా అంటూ స్టెయిన్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

భారత్‌తో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు స్టెయిన్‌ గాయపడటంతో మిగతా రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా స్టెయిన్‌ మాట్లాడుతూ.. 'కనీసం రెండు వారాల పాటు గాయమైన కాలిపై బరువు పడకూడదని వైద్యులు సూచించారు. దీంతో నేను ప్రస్తుతం చేతి కర్రల సాయంతో నడుస్తున్నాను.' అని వాపోయాడు.

ఇంకా మాట్లాడుతూ.. వైద్యులు నాకు ఆరు వారాలు విశ్రాంతి అవసరమని చెప్పారు. రెండు వారాల తర్వాత స్వతహాగా నడవగలను. నాలుగు వారాల తర్వాత పరిగెత్తగలను. ఆరు వారాల తర్వాత ప్రాక్టీస్‌ సెషన్‌ మొదలుపెడతా. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు సిద్ధమవుతా'అంటూ తన నమ్మకాన్ని వెలిబుచ్చాడు.

గాయం కారణంగా సుమారు ఏడాది పాటు ఆటకు దూరమయ్యా. దాంతో పోల్చుకుంటే ఆరు వారాలు గడవడం పెద్ద కష్టమేమీ కాదని స్టెయిన్‌ నవ్వుతూ చెప్పాడు. మిగతా రెండు టెస్టులకు స్టెయిన్‌ దూరమవ్వడం భారత్‌కు కలిసొచ్చే అంశమేనంటూ విమర్శకులు సలహాలిస్తున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 10, 2018, 9:54 [IST]
Other articles published on Jan 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X