న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CWG 2022, IND W vs AUS W:ఆదిలోనే భారత్‌కు గట్టి షాక్.. నిరాశపర్చిన స్మృతి!

CWG 2022: Shafali Verma, Yastika Bhatia Look To Rebuild For India after Smriti Mandhana departed

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్ 2022లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ జట్టు ఆదిలోనే కీలక వికెట్ కోల్పోయింది. 5 బౌండరీలతో దూకుడు కనబర్చిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా(24) కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరింది. డారిస్ బ్రౌన్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో భారీ షాట్‌క ప్రయత్నించిన మంధానా విఫలమైంది.

దాంతో 25 పరుగులకే భారత జట్టు వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి యస్తికా భాటియా రాగా.. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ(11 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతోంది. పవర్ ప్లే ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో భారత్ తరఫున మేఘన సింగ్ అంతర్జాతీ టీ20ల్లోకి అరంగేట్రం చేసింది.

కామన్వెల్త్ గేమ్స్‌లో తొలి మహిళా క్రికెట్‌ను చేర్చారు. బర్మింగ్‌హామ్ వేదికగా గురువారం ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక గేమ్స్‌లో 8 మహిళా క్రికెట్ జట్లను చేర్చారు. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. ఈ రెండు గ్రూపుల నుంచి టాప్ 2 జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం ఇరు జట్ల మధ్య ఫైనల్‌లో స్వర్ణ పతక పోరు జరగనుంది. గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లు ఉండగా.. గ్రూప్ బీలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక టీమ్స్ ఉన్నాయి. భారత్ తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడుతుండగా.. రెండో మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో 31న, మూడో మ్యాచ్‌ను బార్బడోస్‌తో ఆగస్టు 3న ఆడనుంది.

ఈ టోర్నీలో భారత్ కనీసం రజత పతకం గెలిచే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా జట్టు ఒక్కటే భారత్‌కు ప్రధాన పోటీ. ఈ జట్టును ఓడిస్తే స్వర్ణం కూడా గెలవచ్చు.

Story first published: Friday, July 29, 2022, 16:17 [IST]
Other articles published on Jul 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X