న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హై ఓల్టేజ్ మ్యాచ్‌కి సర్వం సిద్ధం: ఓపెన్ టాప్ జీప్‌లో పాక్ ఫ్యాన్స్ హంగామా (వీడియో)

CWC 2019: Pakistan fans have been busy showing their support all over Manchester!

హైదరాబాద్: ప్రపంచకప్‌లో హై ఓల్టేజ్ మ్యాచ్‌కి సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికైంది. ఈ పోరుపై అటు భారత్-పాక్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు. పైకి చూసేందుకు ప్రపంచకప్‌లో కేవలం మరో మ్యాచ్‌లానే కనిపిస్తున్నా ఈ మ్యాచ్‌కి ఉన్న ప్రత్యకతే వేరు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కీలక మ్యాచ్ కావడంతో ఇరు దేశాలకు చెందిన ఆటగాళ్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మైదానంలో ఒత్తిడిని ఏ జట్టు అయితే ఒత్తిడిని జయిస్తుందో ఆ జట్టుదే విజయమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. రెండ జ‌ట్ల ఆట‌గాళ్ల‌పై ఒత్తిడి ఉంటుంద‌ని ర‌వీంద్ర జ‌డేజా అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇది గెలుపు ఓట‌మి స‌మ‌స్య కాదు, ఇది అంత‌క‌న్నా ఎక్కువ అంశ‌మే తెలిపాడు.

కామెంటేట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ సైతం క్రికెట్‌లో భారత్-పాక్ మ్యాచ్ క‌న్నా గొప్ప సంగ్రామ‌మే లేద‌ని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో భావోద్వేగాలే కాదు, ఇంకా ఎంతో ఎంతో ఉంద‌ని ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తెలిపాడు.

ఆరు పాయింట్లతో టీమిండియా నాలుగో స్థానంలో ఉండగా... పాక్‌ నాలుగు మ్యాచ్‌లకు గాను రెండింట ఓడి, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 1992 నుండి 2015 ప్రపంచకప్‌ వరకు భారత్‌, పాక్‌లు ఆరుసార్లు తలపడగా.. ఆరుసార్లు భారతే విజేతగా నిలిచింది.

భారత్-పాక్ మ్యాచ్‌ని కూడా వరుణుడు వదిలా కనిపించడం లేదు. ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోన్న మాంచెస్టర్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

ఇప్పటికే అటు పాకిస్థాన్ అభిమానులతో పాటు ఇటు భారత్ అభిమానులు పెద్దఎత్తున మాంచెస్టర్ స్టేడియానికి చేరుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన పలువురు అభిమానులు అయితే ఓపెన్ టాప్ జీబులో లండన్ వీధుల్లో విహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఐసీసీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.



తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్, రాహుల్, కోహ్లీ (కెప్టెన్), శంకర్/కార్తీక్, ధోనీ, జాదవ్, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్/షమీ, బుమ్రా.

పాకిస్థాన్: ఇమామ్, ఫఖర్, బాబర్, హఫీజ్, సర్ఫరాజ్ (కెప్టెన్), సోహైల్, మాలిక్/ఇమాద్, షాదాబ్, రియాజ్, ఆమిర్, షాహీన్.
Story first published: Sunday, June 16, 2019, 12:03 [IST]
Other articles published on Jun 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X