న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌-పాక్‌ మ్యాచ్ అంటే.. భావోద్వేగాలు, అంచనాలు

CWC 19, India vs Pakistan: Lots Of Emotions, Expectations Involved In India-Pakistan Clash says Hardik Pandya

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 89 పరుగుల (డక్‌వర్త్‌ లూయిస్‌) తేడాతో ఘన విజయం సాధించింది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ముందు టీమిండియా యువ ఆల్‌రౌండర్‌లు హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా.. మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌లు ఐసీసీ నిర్వహించిన ఓ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ అభిప్రాయాలను తెలిపారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

రవీంద్ర జడేజా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ గురించి మాట్లాడారు. 'మేము పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడేటప్పుడు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్ గెలవాలని భారతీయులు కోరుకుంటారు. అందుకే మాపై మరింత ఒత్తిడి పెరుగుతుంది' అని అన్నారు. 'నేను భారత్‌ తరపున క్రికెట్ ఆడేటప్పుడు పాకిస్థాన్‌తో ఎక్కువ మ్యాచులు ఆడేవాళ్లం. అవసరానికి తగినట్టు మమ్మల్ని మేం మార్చుకొనేవాళ్లం' అని సంజయ్‌ మంజ్రేకర్‌ పేర్కొన్నారు.

హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ... 'చాలామంది ఇదొక ఆట మాత్రమే అంటారు. కానీ ఇది ఆట కాదు. ఇది సవాల్‌తో కూడుకున్నది. ఇందులో చాలా భావోద్వేగాలు, అంచనాలు ఉంటాయి. ప్రతిది ఈ మ్యాచ్‌లో ఉంటుంది. భారత్‌-పాక్‌ మ్యాచ్ అంటే.. అంతకు మించి. ఇదొక అద్భుతమైన మ్యాచ్‌. మైదానం మొత్తం నిండుతుంది. కూర్చోవడానికి ఒక్క సీటు కూడా ఖాళీ ఉండదు. అక్కడికి వెళ్లి ఆటను ఆస్వాదించాలని కోరుకుంటున్నా' అని పాండ్య తెలిపారు.

రోహిత్‌ శర్మ (140) భారీ శతకం.. కోహ్లీ (77), రాహుల్‌ (57) హాఫ్‌ సెంచరీలు చేయడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 336 పరుగులు చేసింది. పాక్ పేసర్ ఆమిర్‌కు మూడు వికెట్లు తీసాడు. లక్ష్య ఛేదనలో పాక్ స్కోర్ 166/6 వద్ద వర్షం పడడంతో పాక్‌ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులుగా నిర్ణయించారు. కానీ పాక్‌ ఆరు వికెట్లకు 212 పరుగులే చేసి ఓడింది. ఫఖర్‌ జమాన్‌ (62), బాబర్‌ ఆజమ్‌ (48), ఇమాద్‌ వసీమ్‌ (46 నాటౌ ట్‌) రాణించారు. కుల్దీప్‌, విజయ్‌ శంకర్‌, హార్దిక్‌ పాండ్యాలకు రెండేసి వికెట్లు తీశారు.

Story first published: Monday, June 17, 2019, 9:46 [IST]
Other articles published on Jun 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X