న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విమర్శలు భరించలేక ట్విట్టర్‌లో సానియా విరామం

CWC 19: India vs Pakistan: Indian tennis ace Sania Mirza takes a Twitter break after being trolled for Pakistans loss vs India

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్‌ చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత పాకిస్తాన్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. సోషల్‌ మీడియాలో అయితే మిమ్స్, జోక్స్ పేల్చుతున్నారు. పాక్‌ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, మ్యాచ్‌కు ముందు రోజు బయట షికార్లు చేశారంటూ ఆ దేశ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి పిజ్జాలు, బర్గర్లు, ఐస్‌క్రీమ్‌లు తిన్నారు. ఎవరైనా ఆటగాళ్లు ఇలాంటి తిండి తింటారా? అని అభిమానులు మండిపడుతున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇదిలా ఉంటే.. భారత టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా తన భర్త, పాకిస్తాన్‌ సీనియర్ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌తో కలిసి శనివారం భోజనం చేసేందుకు బయటకు వెళ్లింది. కీలక మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ మానేసి షోయబ్‌తో షికార్లు కొట్టడమేంటని సానియాపై విమర్శల దాడి మొదలెట్టారు. దీంతో సానియా ట్విట్టర్‌కు విరామం ప్రకటించింది. తాజాగా ఓ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.

'ట్విట్టర్‌లో దాడి అయిపోయిందా?. ఇంకా ఇతర సోషల్ మీడియాలలో ట్రోల్ చేయాలనుకుంటున్నారా. ఇక శాంతించండి. ఇది విరామ సమయం' అని సానియా రాసుకొచ్చారు. మరి సానియా ట్విట్టర్‌లో విరామం తీసుకున్నా.. అభిమానులు తమ విమర్శలకు ఫుల్ స్టాప్ పెడతారా? లేకా కొనసాగిస్తారా? చూడాలి.

భారత్ మ్యాచ్‌కు ముందు.. ప్రాక్టీస్‌ మానేసి షోయబ్‌ షికార్లు కొడుతున్నాడని ఓ జర్నలిస్ట్‌ అడగగా.. 'ఆ వీడియోను మా అనుమతి లేకుండా తీసావు. మా ఏకాంతాన్ని గౌరవించలేదు. మాతో చిన్న పిల్లాడు ఉన్నాడనే విషయాన్ని మరచిపోయావు. వీడియో తీయడమే కాకుండా.. చెత్త కథనం జోడించావు. మేం వెళ్లింది షికారుకు కాదు, భోజనం చేయడానికి. మ్యాచ్‌ ఓడినా సరే భోజనం చేసే అర్హత అందరికీ ఉంటుంది. అంతా మూర్ఖుల బృందం. మరోసారి మంచి కథనం రాసేందుకు ప్రయత్నించు' అని సానియా పేర్కొంది.

Story first published: Tuesday, June 18, 2019, 12:02 [IST]
Other articles published on Jun 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X