న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs DC: చేతులెత్తేసిన చెన్నై బ్యాట్స్‌మెన్.. ఢిల్లీ సూపర్ విక్టరీ

CSK vs DC: Delhi Capitals beat Chennai Super Kings by 44 runs
IPL 2020,CSK vs DC Highlights : Delhi Capitals Defeated Chennai Super Kings By 44 Runs || Oneindia

దుబాయ్: తొలి మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండో మ్యాచ్‌లో భారీ విజయంతో సత్తా చాటింది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 44 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా చెలరేగిన ఆ జట్టు.. వరుసగా రెండో విజయం అందుకోగా.. పేలవమైన బ్యాటింగ్, లయ తప్పిన బౌలింగ్‌తో చెన్నై రెండో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు పృథ్వీషా (43 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 64).. శిఖర్ ధావన్(27 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్‌తో 37 ) తో పాటు రిషభ్ పంత్ (25 బంతుల్లో 5 ఫోర్లతో 37 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(26) రాణించారు. చెన్నై బౌలర్లలో చావ్లాకు రెండు వికెట్లు తీయగా.. కరన్ శర్మకు ఒక వికెట్ దక్కింది.

అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగుల మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఫాఫ్ డూప్లెసిస్(43), జాదవ్(26) మినహా అంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో రబడా మూడు వికెట్లు తీయగా, నోర్జ్‌కు రెండు, అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది.

176 లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు మంచి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు షేన్ వాట్సన్(14), మురళీ విజయ్(10) దారుణంగా విఫలమయ్యారు. మూడో ఓవర్‌లో లభించిన లైఫ్ కూడా వాట్సన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ ఓవర్‌లో నోర్జ్ వేసిన మూడో బంతిని వాట్సన్ లెగ్ సైడ్ కొట్టగా ఫార్వార్డ్ ప్లేయర్‌గా ఉన్న పృథ్వీ షా సునాయస క్యాచ్‌ను వదిలిపెట్టాడు. అయినా చెన్నై రాత మారలేదు. పేలవ షాట్లతో ఇద్దరూ క్యాచ్ ఔట్‌లుగా వెనుదిరిగారు. అనంతరం క్రీజులోకి వచ్చి రుతురాజ్ గైక్వాడ్(5) అదృష్టం కలిసిరాక రనౌట్‌గా పెవిలియన్ బాటపట్టాడు.

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్‌తో ఫాఫ్ డూప్లెసిస్ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. వీరి ఆట మరీ నిదానంగా సాగడంతో రిక్వైడ్ రన్ రేట్ పెరిగి బ్యాట్స్‌మెన్ ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితిల్లో కేదార్ జాదవ్(26) ఎల్బీగా వెనుదిరగడంతో చెన్నైకి విజయవకాశాలు లేకుండా పోయాయి. ఆ వెంటనే డూప్లెసిస్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. ధోనీ(15)కూడా చేతులెత్తేశాడు. చివర్లో జడేజా(12) కూడా ఔటవ్వడంతో ఢిల్లీ విజయం లాంఛనమైంది. ఓవైపు ఢిల్లీ సమష్టిగా చెలరేగితే.. మరోవైపు చెన్నై మూకుమ్మడిగా విఫలమైంది.

Story first published: Friday, September 25, 2020, 23:40 [IST]
Other articles published on Sep 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X