న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

11 ఫోర్లు, 7 సిక్సర్లతో సురేశ్ రైనా వీరవిహారం.. 46 బంతుల్లోనే సెంచరీ! (వీడియో)

CSKs Suresh Raina Smashes 46-ball 104 in Local T20 Game Ahead of IPL 2021
IPL 2021 Auction : Chennai Super Kings Complete Players List, Squad

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 46 బంతుల్లోనే సెంచరీ చేసి మునపటి ఫామ్ అందుకున్నాడు. స్థానిక టీ20 టోర్నమెంట్‌లో నిజ్వాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. సురేశ్ రైనా (46 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 104 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు.
దాంతో అతను ప్రాతినిథ్యం వహించిన టైటాన్ జెడ్‌ఎక్స్ టీమ్ అద్భుత విజయాన్నందుకుంది.

19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..

19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..

సురేశ్ రైనా సునామీ ఇన్నింగ్స్‌తో 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒక బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. బ్యాటింగ్‌లోనే కాకుండా.. బౌలింగ్‌లోనూ రైనా సత్తాచాటాడు.టైటాన్ జెడ్‌ఎక్స్ ఛేదనలో ఆరంభం నుంచే సురేశ్ రైనా దూకుడుగా ఆడేశాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన సురేశ్ రైనా.. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడేశాడు.

బౌలింగ్‌లోనూ..

బౌలింగ్‌లోనూ..

దాంతో ఓవర్‌కు కనీసం 10 పరుగుల చొప్పున రాబడుతూ వచ్చిన రైనా.. ఒంటిచేత్తో టీమ్‌కు విజయాన్ని అందించాడు. అంతకముందు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన రైనా.. 27 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా పడగొట్టాడు. రైనా ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోను సురేశ్ రైనా ఫ్యాన్స్ క్లబ్ షేర్ చేయగా.. వైరల్ అయింది. ఐపీఎల్ 2020 సీజన్‌కు వ్యక్తిగత కారణాలతో సురేశ్ రైనా దూరమైన విషయం తెలిసిందే. ఓవైపు కరోనా, మరోవైపు కుటుంబ సభ్యుల దారుణ హత్యతో టోర్నీ ముందే తప్పుకున్నాడు.

సీఎస్‌కే తరఫునే..

రైనా గైర్హాజరీలో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమైంది. టోర్నీ చరిత్రలోనే తొలి ప్లే ఆఫ్ చేరకుండా నిష్క్రమించింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో సురేశ్ రైనా సీఎస్‌కే తరఫునే బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ ఇటీవల రైనాను రిటైన్ చేసుకుంది. భారత్ వేదికగా ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. గతేడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు సురేశ్ రైనా రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ధోనీ ఆటకు అల్విదా ప్రకటించినా క్షణంలోనే అతని బాటలోనే తాను కూడా అని సురేశ్ రైనా తెలిపాడు.

Story first published: Sunday, February 21, 2021, 17:33 [IST]
Other articles published on Feb 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X