న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018లో ధోనీ సూపర్ ఫామ్ వెనుక ఉన్న రహస్యం ఇదే: ఫ్లెమింగ్

CSK coach Stephen Fleming reveals why MS Dhoni is in rich form at IPL 2018

హైదరాబాద్: ఐపీఎల్‌ 11లో మహేంద్రసింగ్‌ ధోనీ మళ్లీ చెలరేగి ఆడుతున్నాడు. ధోనీ ప్రస్తుత ఆటతీరు చూస్తుంటే ఒకప్పటి దనాధన్ ధోనీని గుర్తుకుతెచ్చేలా అతని ఆటతీరు అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ధోనీ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున 12 మ్యాచ్‌లు ఆడి.. 103.25 స్ట్రైక్‌రేటుతో 413 పరుగులతో మంచి దూకుడు మీదున్నాడు. ఇందులోనే 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.

చెలరేగడానికి కారణం ఏమిటంటే

చెలరేగడానికి కారణం ఏమిటంటే

ధోనీ ఇలా ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చి చెలరేగడానికి కారణం ఏమిటంటే సూపర్‌కింగ్స్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్‌లోని తోటి ఆటగాళ్లు కన్నా ఎంతో ముందే ధోనీ ట్రైనింగ్ ప్రారంభించాడని తెలిపాడు. పట్టుదలతో కటోర శ్రమ చేసిన దాని ఫలితమే ప్రస్తుత ఫామ్‌ అని ఫ్లెమింగ్‌ వివరించాడు.

 టోర్నమెంట్‌కు ముందు ధోనీ ఎంతో ప్రాక్టీస్‌

టోర్నమెంట్‌కు ముందు ధోనీ ఎంతో ప్రాక్టీస్‌

‘మానసికంగా ఎంతో సన్నద్ధం కావడం వల్ల అనుకుంటా.. టోర్నమెంట్‌కు ముందు ధోనీ ఎంతో ప్రాక్టీస్‌ చేశాడు. మేం ఎవరం రాకముందు నుంచే చాలాకాలంగా అతను కటోరమైన ప్రాక్టీస్‌ చేశాడు. దృఢనిశ్చయంతో వివిధ రకాల బంతులను ఆడటం ప్రాక్టీస్‌ చేశాడు' అని ఫ్లెమింగ్‌ వివరించాడు.

 100శాతం కమిట్‌మెంట్‌తో భారీషాట్లు

100శాతం కమిట్‌మెంట్‌తో భారీషాట్లు

సింగిల్స్‌ తీయడం కన్నా భారీ షాట్ల మీద ధోనీ ఎక్కువ ఫోకస్‌ చేశాడని, 100శాతం కమిట్‌మెంట్‌తో అతను భారీషాట్లు ఆడుతున్నాడని, పాజిటివ్‌ ఫుట్‌వర్క్‌తో అతను బ్యాటింగ్‌ చేస్తుండటం, అద్భుతంగా ఆడుతుండటం చూస్తుంటే.. అతని కటోరశ్రమను కొనియాడక తప్పదని ఫ్లెమింగ్‌ పేర్కొన్నాడు.

 నిర్ణయాలు తీసుకోవడంలో చాలా క్లియర్‌గా

నిర్ణయాలు తీసుకోవడంలో చాలా క్లియర్‌గా

'నిర్ణయాలు తీసుకోవడంలో చాలా క్లియర్‌గా కనిపిస్తాడు. జట్టు బౌలింగ్ ప్రదర్శనపై కూడా మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ప్రస్తుతం వాటిని చక్కగా అమలు చేయగలుగుతున్నాడు. ఫిట్‌నెస్, బౌలింగ్ టెక్నిక్ వీటిపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. డెత్ బౌలర్లపై కూడా నేర్పును ప్రదర్శించి ఆటను చక్కగా ముగించగలడు. చెన్నై జట్టు మే 18శుక్రవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుతో తలపడేందుకు ఢిల్లీకి చేరుకోనుంది.

Story first published: Monday, May 14, 2018, 10:38 [IST]
Other articles published on May 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X