న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

100 రోజుల్లో వరల్డ్‌కప్ 2019: అభిమానులు తెలుసుకోవాల్సిన విషయాలివే!

Cricket World Cup 2019: with 100 days to go, heres what you need to know

హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్‌ మెగా టోర్నీకి సమయం దగ్గర పడుతోంది. నాలుగేళ్ల కొకసారి జరిగే ఈ వరల్డ్‌కప్‌కు ఈ ఏడాది ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోంది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వబోతోంది. చివరగా 1999లో ఆ దేశం ఈ మెగా టోర్నీని నిర్వహించింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఆతిథ్యమిస్తోన్న ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం పది జట్లు బరిలో దిగుతున్నాయి. 11 వేదికల్లో జరిగే ప్రపంచకప్‌లో మొత్తం 48 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి.

<strong>'ఆర్థిక సాయం చేయండి.. అంతర్జాతీయ టోర్నీల్లో ఆడతా'</strong>'ఆర్థిక సాయం చేయండి.. అంతర్జాతీయ టోర్నీల్లో ఆడతా'

రౌండ్‌రాబిన్ పద్థతిలో

ఈ ఏడాది మే 30న ప్రారంభమయ్యే ఈ వరల్డ్ కప్ జూలై 14న ముగియనుంది. ఈ సారి వరల్డ్‌కప్‌ను రౌండ్‌రాబిన్ పద్థతిలో నిర్వహిస్తున్నారు. టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశిస్తాయి. సెమీస్ విజేతలు చారిత్రక లార్డ్స్ మైదానంలో ఫైనల్లో తలపడతాయి. ఐదుసార్లు వరల్డ్‌కప్‌ను నెగ్గిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు భారత్, ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరెట్లలో ముందువరుసలో ఉన్నాయి. వరల్డ్‌కప్ టోర్నీకి సరిగ్గా 100 రోజులు ఉన్న నేపథ్యంలో అభిమానుల కోసం ప్రత్యేకం.

20 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌లో

20 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌ మళ్లీ వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వబోతోంది. చివరగా 1999లో ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ టోర్నీని ఆ దేశం నిర్వహించింది. అంతేకాదు వరల్డ్‌కప్‌కు అత్యధికంగా ఐదు సార్లు ఆతిథ్యమిచ్చిన దేశం ఇంగ్లాండే కావడం విశేషం. తొలి మూడు వరల్డ్‌కప్‌లు (1975, 79, 83) ఇంగ్లాండ్‌లోనే జరిగాయి. మే 30న ఓవల్‌ మైదానంలో ఇంగ్లాండ్‌-దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో 2019 వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. ఫైనల్‌ జులై 14న లార్డ్స్‌లో జరుగుతుంది.

ఇది 12వ వరల్డ్‌కప్

వన్డే క్రికెట్లో ఇది 12వ వరల్డ్‌కప్. తొలిసారి 1975లో వరల్డ్‌కప్ జరగ్గా.. అప్పట్నుంచి నాలుగేళ్లకోసారి క్రమం తప్పకుండా ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నారు. వరల్డ్‌కప్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఆస్ట్రేలియా ఉంది. ఆ జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచింది. చివరగా 2015లో సొంతగడ్డపైనే జరిగిన వరల్డ్‌కప్‌ పైనల్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.

రెండు సార్లు వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా

రెండు సార్లు వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా

ఇప్పటివరకు భారత క్రికెట్ జట్టు గెలిచిన వరల్డ్ కప్‌లు రెండు. 1983లో అంచనాల్లేకుండా బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్లో వెస్టిండిస్‌పై విజయం సాధించి తొలిసారి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2011లో సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్లో శ్రీలంకపై విజయం సాధించింది.

మొత్తం 10 జట్లు

ఈసారి వరల్డ్ కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఎనిమిది జట్లు ర్యాంకింగ్స్‌ ద్వారా నేరుగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించగా.. వెస్టిండీస్‌, అఫ్గానిస్థాన్‌ అర్హత టోర్నీ ద్వారా బెర్తులు సాధించాయి.

మొత్తం మ్యాచ్‌లు 48

ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో మొత్తం మ్యాచ్‌లు 48. ఇంగ్లాండ్‌, వేల్స్‌ల్లోని మొత్తం 11 వేదికల్లో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.

Story first published: Tuesday, February 19, 2019, 13:18 [IST]
Other articles published on Feb 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X