WTC Final: అలా జరిగితే.. 81 పరుగులతో కోహ్లీసేనదే విజయం.. ఫ్యాన్స్ లెక్కలు!

WTC Final Day 5 : అలా ఆడితే IND Winner, సెషన్‌ 3 లో 183 రన్స్‌కే NZ ఆలౌట్ ? || Oneindia Telugu

సౌతాంప్టన్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు వరణుడు ఆటంకం కలిగిస్తూనే ఉన్నాడు. వర్షం కారణంగా తొలి రోజు పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. రెండో రోజు రెండు సెషన్లు మాత్రమే సాధ్యమైంది. ఇక మూడో రోజు కొంత బ్రేక్ తీసుకున్న వాన దేవుడు.. పూర్తి ఆటకు సహకరించాడు. బ్యాడ్ లైట్ కారణంగా అరగంట ముందే మ్యాచ్ ఆగిపోయినా.. మూడు సెషన్ల ఆట సాధ్యమైంది. ఇక కీలకమైన నాలుగో రోజు మళ్లీ జోరందుకున్న వరణుడు పూర్తి ఆటను మింగేసాడు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మైదానం నీటితో మునిగిపోయింది. పిచ్‌పై కవర్లు కప్పిఉంచినప్పటికీ.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. మధ్యలో కొంత వర్షం ఆగినప్పటికీ.. మైదానాన్ని పలుమార్లు పరిశీలించిన అంపైర్లు నాలుగో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

డ్రా అయ్యే చాన్స్..

డ్రా అయ్యే చాన్స్..

ఈ మ్యాచ్‌కు ఐసీసీ రిజ్వరేడేను కేటాయించడంతో మొత్తం ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఈ రెండు రోజులు వర్షం అంతరాయం కలిగించకుంటే మ్యాచ్ ఫలితం తేలనుంది. అలా కాకుండా ఒక్క సెషన్ రద్దయినా మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఫస్ట్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఇరు జట్లు షేర్ చేసుకోనున్నాయి. ఇక రిజర్వ్ డే ఆడించడంపై కూడా ఐదో రోజు ఆట చివరి గంటలో నిర్ణయం తీసుకోనున్నారు. ఫలితం తేలే అవకాశం ఉంటేనే రిజర్వ్ డేను ఉపయోగించుకోనున్నారు.

న్యూజిలాండ్‌దే పైచేయి..

న్యూజిలాండ్‌దే పైచేయి..

ఇప్పటి వరకు జరిగిన ఆటను పరిశీలిస్తే న్యూజిలాండ్‌‌దే పైచేయి కనిపిస్తోంది. సెకండ్ డే ఆటలో కివీస్‌పై భారత్ ఎడ్జ్ సాధించినా.. మూడో రోజు ఆటలో మాత్రం విఫలమైంది. కైల్‌ జేమీసన్‌ (5/31) నిప్పులు చెరగడంతో భారత్‌ బదులివ్వలేకపోయింది. 92.1 ఓవర్లలో 217 పరుగుల‌కు తొలి ఇన్నింగ్స్ ముగించింది. తర్వాత న్యూజిలాండ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోరుకు 116 పరుగుల దూరంలో నిలిచింది. విలియమ్సన్‌ (12 బ్యాటింగ్‌), రాస్‌ టేలర్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

రెండు రోజుల ఆట సాగితే..

వర్షం అంతరాయం మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలను సూచిస్తున్నా.. పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై రిజర్వ్ డేతో కలుపుకొని మరో రెండు రోజుల్లో ఫలితం తేలుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా వాతావరణ శాఖ సైతం చివరి రెండు రోజులు వర్షాలు లేవని చెబుతుంది. కాబట్టి ఈ రెండు రోజుల పాటు ఆట పూర్తిగా సాగితే.. ఓ జట్టు చాంపియన్‌గా నిలవవచ్చు. ప్రస్తుతానికి న్యూజిలాండ్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తున్నప్పటికీ.. భారత్ అవకాశాలను కొట్టిపారేయేలేం. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ టీమిండియా విజయావకాశాలను విశ్లేషిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ఆడితే 91 పరుగులతో విజయం సాధించవచ్చని సూచిస్తున్నారు.

203‌కు ఆలౌట్ చేస్తే..

203‌కు ఆలౌట్ చేస్తే..

ఐదో రోజు ఆటలో సెకండ్ సెషన్‌ ఆరంభంలోనే న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేస్తే భారత్‌కు విజయవకాశాలుంటాయంటున్నారు. ఫస్ట్ సెషన్‌లో భారత పేసర్లు చెలరేగి కివీస్‌ను 167/7కు కట్టిడి చేస్తే.. సెకండ్ సెషన్ ఆరంభంలో 203 పరుగులకు ఆలౌట్ చేయవచ్చంటున్నారు. ఆ తర్వాత సెకండ్ సెషన్ ముగిసేవరకు భారత్ వికెట్ నష్టపోకుండా 31 రన్స్ చేయాలని.. చివరి సెషన్‌ పూర్తయి ఆట ముగిసే సరికి 143/4తో మెరుగైన స్థితిలో ఉండాలంటున్నారు. రిజర్వ్‌డే అయిన చివరి రోజు.. ఫస్ట్ సెషన్‌లో ప్రత్యర్థి బౌలర్లను డామినేట్ చేసి 251 పరుగులు చేయాలని, సెషన్ చివరిలో న్యూజిలాండ్‌ను బ్యాటింగ్ ఆహ్వానించి 3 పరుగులకే వికెట్ తీయాలంటున్నారు. ఆ తర్వాత సెషన్ 2‌లో కివీస్‌ను 89/3కి పరిమితం చేసి.. సెషన్‌3లో 183 రన్స్‌కే ఆలౌట్ చేస్తే విజయం దక్కుతుందంటున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, June 21, 2021, 20:59 [IST]
Other articles published on Jun 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X